19, నవంబర్ 2011, శనివారం
ఇది వర్మ రామాయణం
Categories :
entertainment . ramayanam . TOP . varma
రామ్ గోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో విలక్షణంగా ఆలోచించే డైరెక్టర్. స్టోరీ కన్నా, ప్రచారంతోనే సగం బిజినెస్ చేసుకునే టైప్. సిచ్యువేషన్‌కు తగ్గ సినిమాలు తీయడంలో ఆయనది ప్రత్యేకమైన స్టైల్. బెజవాడకు చెందిన ఓ లీడర్ చనిపోగానే.. బెజవాడ రౌడీలంటూ సినిమా మొదలుపెట్టేసిన ఘనత వర్మది.
అలాంటి రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు రామాయణంపై కన్నేశారు. రామాయణాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ఆ స్టోరీని ప్రస్తుత పరిస్థితులకు ఆపాదించి.. సినిమా తీయాలనుకుంటున్నారు. దానికి పేరు కూడా రామాయణం అనే పెట్టారు. త్వరలోనే సినిమా తీస్తానంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
స్టోరీని కూడా ముందే ప్రకటించారు వర్మ. అయోధ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. లంక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మధ్య జరిగే ఆధిపత్య పోరాటం అన్నారు. సినిమాలో క్యారెక్టర్ల పేర్లను కూడా రామాయణం నుంచే తీసుకున్నారు. వర్మ తీసే మోడ్రన్ రామాయణంలో రాముడిపేరు రామ్ శంకర్. కైకేయి పేరు కైకేయి అగర్వాల్.. భరతుడి పేరు భరత్ కుమార్.
బాపు-బాలకృష్ణల శ్రీరామరాజ్యం సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న సమయంలో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు వర్మ. మరి వర్మ ప్లాన్ సక్సెస్ అవతుందా.. వర్మ రామాయణం సక్సెస్ అవుతుందా..? ఇదే ఇప్పుడు తేలాలి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"....బెజవాడకు చెందిన ఓ లీడర్ చనిపోగానే.. బెజవాడ రౌడీలంటూ సినిమా...."
ఎవరా లీడరు! అప్పుడెప్పుడో 1988 లో హత్య కావించబడ్డ ఎం ఎల్ ఎ అయిన రౌడీనా? ఇరవై మూడేళ్లకి అదే సంఘటన తీశారంటారా ? ఈ మధ్య విజయవాడ రౌడీ ఎవరూ పోలేదే? అతనెవరో ఒకతన్ని హైదరాబాదులో చంపారు, ఆతను లీడరుగా పేరు పడలేదే, ఉత్తి రియల్ ఎస్టేట్ రౌడీ . ఆ కథా వర్మ తీసినది!