18, నవంబర్ 2011, శుక్రవారం
జగన్ కు జయసుధ జెల్లకాయ
జగన్ నెత్తిన జయసుధ జెల్లకాయిచ్చింది. ఓ వైపు సీబీఐ దర్యాప్తు.. ఈడీ విచారణతో తెగ టెన్షన్ పడుతున్న జగన్, ఊహించని రీతిలో జయసుధ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యింది. ఇంతకాలం జగన్ వెంటే అంటూ రాజీనామా లేఖను కూడా సమర్పించిన జయమ్మ.. వాటి ఆమోద సమయం వచ్చేసరికి రూట్ మార్చేసింది. గోడ మీద పిల్లిలా.. కిరణ్ కుమార్ రెడ్డివైపు దూకేసింది. దీనికి నిదర్శనంగా ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో ఆమె భేటీ అయ్యింది. కిరణ్‌కుమార్‌రెడ్డికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని మీడియాతో చెప్పిన జయసుధ.. సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన పనితీరు ఎంతో ప్రశంసనీయమన్నారు. రాజీవ్ యువకిరణాలు ఎంతోమంచి 0పథకమని, మంచి పేరు తెచ్చుకోవడం కోసం సీఎం నిరంతరం కృషి చేసే వ్యక్తి అని చెప్పారు. ఈ మాటలు విండే జగన్ గుండెలు ఏమైపోతాయో..? అసలే పశ్చిమగోదావరి ఎమ్మెల్యేలు ఆళ్లనాని, రాజేష్, బాలరాజులు సీఎం గ్రూప్ లో చేరిపోయిన సంగతే ఇంకా జీర్ణం కాలేదు. అంతలోనే జయసుధ ఝలక్. ఇంకెంతమంది అధికారపార్టీ వైపు జంప్ అవతారో చూడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి