15, నవంబర్ 2011, మంగళవారం
శని రూటు మార్చాడు..!
నేటి నుంచి కాల చక్రం దిశ మారింది. 30 ఏళ్లకు ఓసారి వచ్చే తులాయనం ప్రారంభమైంది. శని తులారాశిలోకి ప్రవేశించింది. మందగమనుడిగా పేరొందిన శని గ్రహం బలపడిందని..దీని వల్ల రాష్ట్రం, దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని బెజవాడలోని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
శనిగ్రహం ఉచ్ఛస్థితికి చేరడంతో ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్యులు. కాలచక్రం మారడంతో తుల, వృశ్చిక రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కర్కాటక, మీన రాశులకు అష్టమ, అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది. దీని వల్ల రానున్న ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉపద్రవాలు, దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంది. పొలిటికల్ లీడర్లు, సినిమా, క్రికెట్ సెలబ్రెటీలకు గండం తప్పదంటున్నారు పండితులు.
శని రాశి మారడం వల్ల స్త్రీలకు కష్టాలు.. పిల్లలకు బాలారిష్టాలు అధికమవుతాయి. శని ప్రభావం తప్పించుకునేందుకు.. శనీశ్వర ఆలయాల్లో త్రయోన్నిక గ్రహశాంతి హోమాలను నిర్వహిస్తున్నారు. తాజా పరిణాలతో.. సింహ, వృషభ, ధను రాశుల వారికి శని పీడ నుంచి విముక్తి లభించినట్లేనంటున్నారు జ్యోతిష్యులు. అయితే మిగతా రాశులు మాత్రం శని ప్రభావం నుంచి తప్పించుకోలేవంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి