15, నవంబర్ 2011, మంగళవారం
మాంసం తింటే మటాష్..!
మాంసం తింటున్నారా... అయితే మీరు ఖచ్చితంగా మధుమేహం భారిన పడకతప్పదు... ఇది లండన్‌లోని ఓ యూనివర్సిటీ నిపుణులు చేస్తున్న హెచ్చరిక. కేవలం వార్నింగ్ ఇవ్వడమే కాదు.. డయాబెటీస్‌ను దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో కూడా సూచిస్తున్నారు. ఆ సలహా ఏమిటంటే.. చేపలు తినాలని.
మాంసం బదులు.. చేపలు.. చేప తింటే చక్కెర వ్యాధికి చెక్ చెప్పినట్లే. రోజూ ఫిష్ తినేవారికి షుగర్ వ్యాధి రానే రాదట. రోజూ చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ను దూరంగా ఉంచవచ్చని... లండన్‌లోని వలెన్సియా యూనివర్సిటీ నిపుణులు పరిశోధించి తేల్చారు. 55 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న 945 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు... చేపలు తిన్నవారిలో డయాబెటీస్ సాధారణ స్థితిలో ఉన్నట్లు కనిపెట్టారు. అదే సమయంలో మాంసం తిన్న వారిలో షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించారు... చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోల్ చేస్తున్నట్లు గుర్తించారు... చేపల వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని వలెన్సియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. చేప తినండి.. చక్కెర వ్యాధికి దూరం కండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సతీష్ గారు మన దేశంలొ తప్ప ఇతర దేశాలలో ముక్క లేనిదే ముద్ద దిగదు!