15, నవంబర్ 2011, మంగళవారం
డీజీపీ ఆస్తులపై హైకోర్ట్ విచారణ
రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరగనుంది. రాష్ట్ర డీజీపీ దినేశ్ కుమార్, భారీగా అక్రమాస్తులు కూడా బెట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ జరపనుంది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో పనిచేసినప్పుడు దినేశ్‌కుమార్ అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్ ఈ పిటిషన్‌ను హైకోర్ట్‌లో దాఖలు చేశారు. ఆయన భార్య కమలారెడ్డి పేరిట భారీగా ఆస్తులున్నాయంటూ ఉమేశ్‌కుమార్ ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్ట్.. కేసును విచారణకు స్వీకరించింది. డీజీపీ ఆస్తులకు సంబంధించిన వివరాలను అందివాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, ఇవాళ డీజీపీ.. తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను వెల్లడించాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో.. తనపేరిట, తన భార్య పేరిట ఎలాంటి ఆస్తులు లేవని ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. అయితే, డీజీపీ భార్య కమలారెడ్డి భార్య పేరిట జరిగినట్లుగా భావిస్తున్న కొన్ని వివరాలను ఉమేశ్‌కుమార్ కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఏ వివరాలను కోర్టుముందు ఉంచుతారన్నది ఆసక్తికరంగా మారింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి