14, నవంబర్ 2011, సోమవారం
TV9ని అమ్మేశారట..!
Categories :
media . news . ravi prakash . TOP . tv9
తెలుగు టెలివిజన్ న్యూస్ లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన టీవీ9 యాజమాన్యం మారిపోతోంది. టీవీ9ని స్థాపించిన ఐలాబ్స్ ఛైర్మన్ శ్రీనిరాజు తన వాటాను అమ్మేయడానికి సిద్ధమయ్యారు. ఎడిల్ వీస్ అనే ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థ, ముంబాయికి చెందిన ఓ మీడియా సంస్థ (ఇప్పటివరకూ తెలిసిన సమాచారం ప్రకారం టైమ్స్ గ్రూప్) సంయుక్తంగా శ్రీనిరాజు వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఐలాబ్స్ కున్న 60 శాతం వాటాను ఈ రెండు సంస్థలు కొంటున్నాయి. వాస్తవానికి 35 శాతం వాటాను మాత్రమే అమ్మాలని శ్రీనిరాజు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, మొత్తం వాటాను అమ్మేయాలంటూ ఈ సంస్థలు అడిగినట్లు సమాచారం. డీల్ సైజ్ దాదాపు 500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. రెండేళ్ల క్రితం వరకూ శ్రీనిరాజుకు 80 శాతం వాటా ఉండేది అయితే, 20 శాతం వాటాను SAIF పార్టనర్స్ కు అమ్మేశారు. మిగిలిన 20 శాతం రవిప్రకాశ్ కు, అతని సహచరులకు ఉంది. టీవీ9 ప్రస్తుతం తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ న్యూస్ ఛానళ్లతో పాటు, బెంగళూరు కేంద్రంగా న్యూస్ 9, హైదారాబాద్ కేంద్రంగా టీవీ1ను నడుపుతోంది. ఇవన్నీ కూడా కొత్త మేనేజ్ మెంట్ కిందకు వెళ్లిపోనున్నాయి. మార్చిలో టేకోవర్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకూ టీవీ9లో రవిప్రకాశ్ ఆడింది ఆట..పాడింది పాటగా చెలామణీ అయ్యింది. మరి కొత్త మేనేజ్ మెంట్ వస్తే పరిస్థితి ఏమిటన్నది టీవీ9 వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఏమీ ఆశ్చర్యపోనక్కర లేదు. నిన్న కాంగ్రెసుబాకాగా మొదలయిన సాక్షికాస్తా సంపూర్ణ కాంర్రెస్ వ్యతిరేకనగారాగా మారలేదా? రేపో మాపో ఈ TV9 ఛానెల్ కాస్తా కాంగ్రెసుబాకాగా మారిఫోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎవరికైనా గుర్తుందా? ఒకప్పుడు దక్కన్ క్రానికల్ పూర్తి కాంర్రెస్ వ్యతిరేక పత్రికగా ఉంటూ, యాజమాన్యం మారిన తర్వాత కాంగ్రెసుబాకాగా అయిపోయింది. ఇవన్నీ మామూలే.