జూపల్లి జూపిల్లిలా మారిపోయారు. పులి గాండ్రించి.. చివరకు పిల్లిలా తోకముడిచారు. జూపల్లి కృష్ణారావు చేసిన రాజీనామా పెద్ద కామెడీ సీన్‌ను తలపించింది. తెలంగాణ రానందుకు, కేంద్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించనందుకు రాజీనామా చేస్తున్నానని పీలర్లు వదిలిన జూపల్లి... మీడియాతో కూడా అదే విషయాన్ని చెప్పారు. కానీ, కిరణ్‌కుమార్‌కు ఇచ్చిన రాజీనామా లెటర్‌లో మాత్రం కొన్ని షరతులు పెట్టారంట. అంతేకాదు, గురువారం ఉదయం ప్రభుత్వ కారును కాకుండా, సొంతకారులో అసెంబ్లీకి వచ్చిన హల్‌చల్ చేసిన కృష్ణారావు, రాజీనామా చేసినా, విధులకు మాత్రం హాజరవుతానంటూ తేల్చి చెప్పేశారు. రాజీనామా చేశాక.. ఇక విధులకు హాజరుకావాల్సిన అవసరం ఏముంది? అంటే రాజీనామా చేసినట్టా.. చేయనట్టా..? తన రాజీనామాను ఎలాగూ సీఎం ఆమోదించడు కాబట్టే రాజీనామా చేశారా..? ఏమో అంతా గందరగోళం. కాంగ్రెస్ వారికి మాత్రమే తెలిసిన రాజకీయం. జూపల్లి దెబ్బకు దిమ్మ తిరిగిన కాంగ్రెస్ మంత్రులు మాత్రం.. అంతా ఉత్తుత్తిరాజీనామానే అంటూ తేల్చేస్తున్నారు.
3, మార్చి 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగుంది