30, డిసెంబర్ 2010, గురువారం
మరో వారం రోజులే...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటి, తొలిరోజు చెప్పినట్లే గడువులోగా తమ పని పూర్తి చేసింది. డిసెంబర్ 31కు ఒక్క రోజు ముందే హోమంత్రికి కీలకమైన నివేదికను అందచేసింది. రెండు అనుబంధాలుగా సిద్దమైన ఈ నివేదికలో ఎన్నో అంశాలను శ్రీకృష్ణ కమిటీ స్పృశించింది. నివేదికలో ఏమున్నదో బయటపెట్టే బాధ్యతను కూడా హోమంత్రిపైనే ఉంచింది. కమిటీ నుంచి రిపోర్ట్‌ను అందుకున్న వెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన హోంమంత్రి చిదంబరం దానిలోని వివరాలను వెల్లడించడానికి వారం రోజుల గడువును విధించారు. వచ్చే గురువారం అంటే జనవరి 6న నివేదికను ప్రజల ముందు పెట్టబోతున్నారు. దీనికన్నా ముందు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ చర్చలు జరుపుతామని చిదంబరం ప్రకటించారు. రిపోర్ట్‌లో ఏముంది..? కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నది తేలడానికి మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
i am the first