17, ఆగస్టు 2010, మంగళవారం
సోనీ మాయ...
ఇండియన్ ఐడల్‌గా శ్రీరాం ఎన్నికవ్వడమేమోగానీ, ఎస్ఎంఎస్ల గురించి మళ్లీ వివాదం మొదలయ్యింది. ప్రతీ ప్రోగ్రాంకు ఎస్సెమ్మెలు పంపించడంటూ రిక్వెస్ట్ చేయడం కామన్ అయిపోయింది. కొన్ని ప్రోగ్రాంలకైతే.. ఎస్సెమ్మెస్ ద్వారా విజేతలనూ నిర్ణయిస్తున్నారు. చెప్పుకుంటూ వెళితే ఇదంతా పెద్ద డిస్కషన్ కూడా అవుతుంది. ఎందుకంటే తెలుగులో వచ్చే ప్రోగ్రాంలన్నీ ఎస్సెమ్మెస్లతోనే నడుస్తున్నాయి. ఇక శ్రీరాం చంద్ర విషయానికి వద్దాం. సోనీలో టెలికాస్ట్ అయిన ఫైనల్స్ లైవ్ కవరేజ్లా కనిపించలేదు. కానీ,
ఆగస్టు 15న గ్రాండ్ ఫినాలే అంటూ సోనీ టెలివిజన్ హడావిడి చేసింది. గెస్ట్లుగా అమితాబ్, కరీనా సహా ఎంతోమంది వీఐపీలు రావడం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండడం, అంతా చూస్తే అది లైవ్కవరేజ్లానే లేదు. (సోనీ కూడా బగ్ వేసుకోలేదనుకోండి). ఇక్కడే అసలు తిరకాసు ఉంది. ప్రోగ్రాంను చూస్తే దాదాపు రెండు మూడు రోజుల ముందే షూటింగ్ అయిపోయినట్లు కనిపించింది. కానీ, ఎస్ఎంఎస్లు మాత్రం ఆగస్టు 15 రాత్రి 8 గంటల వరకూ ఎస్ఎంఎస్లను అడిగింది. అంటే శ్రీరామ్‌కు అవార్డు ఇచ్చేసిన తర్వాత కూడా జనాన్ని దోచుకోవడానికి ఎస్ఎంఎస్లను స్వీకరించిందన్నమాట. ఎంత మోసం..
ఇక్కడ మరో విషయాన్ని చెప్పుకోవాలి. సోనీ ప్రోగ్రాం ఇలా అయ్యిందో లేదో.. అలా సాక్షికోసం ముంబై నుంచి లైవ్‌లో కనిపించాడు శ్రీరామ్. సాధారణ పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా.. శ్రీరాంను గెలిపించొద్దా అన్న అనుమానం మీకు రావచ్చు. నేను ప్రశ్నించేది ఛానల్ తీరు గురించి.. జనాన్ని మోసం చేయడం గురించి. మీరేమంటారు..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగా పసిగట్టారు మోసాన్ని.
నాకూ అలానే అనిపించిందండి.
నిజమే
నేనీ ప్రోగ్రాం చూడలేదు కాబట్టి వ్యాఖ్యానించలేను కానీ మరీ ఇంత పబ్లిక్ గా మోసం చేయరేమో అనిపిస్తుంది. మహా అయితే బ్రేక్ లేకుండా జరిగిన లైవ్ ని మనకి ప్రకటనల బ్రేక్ తో కొన్ని గంటల తేడాతో టెలికాస్ట్ చేసి ఉండచ్చు. అదీ కాక ఆ రాత్రి పన్నెండింటికి అమితాబ్ ట్వీట్ ఇది. నిజం కాకపోతే ఆయన పనిగట్టుకుని చెప్పాల్సిన పనిలేదు కదా..
T90 -Back from 'Indian Idol' - Sriram the winner by public vote .. Had to declare it .. most painful task. Feel bad for those that lost. 12:10 AM Aug 16th via web.
sir,
usual gaa hindi programs grand finale telecast time kante oka 2hrs mundu shooting start avutundi.anni programs anthe.akkada shooting jaruguthundagaane program telecast start avutundhi
anduke sreeram intlo sambaraalu 10.00 ke start aiyaayi.media ki kooda ee vishayam telusu sreeram gelichaadani.kaani official statement vache varaku vaalu reveal cheyyaledu.endukante ,sony vaadu ala cheste legal action teesukuntaadu.
anduke sreeram ventane Sakshi interview lo kanpinchaadu
సాయి గారు బాగా చెప్పారు, కానీ ఈ channels అన్ని కూడా ౩ రూపాయల sms numbers నీ estunnai ఇక్కడే వాటి వ్యాపర ద్రుష్టి కనపడుతుంది అవ్వి prekshalula జేబులు కొత్తదనకి ఈ పద్దతి పెట్టి నారు. www.phonenomber.com