6, మే 2010, గురువారం
కసబ్ ఉరి ఎప్పుడు?
Categories :
దేశం యావత్తూ.. ఉత్కంఠగా ఎదురు చూసిన ఫలితం వెలువడింది. కరుడుగట్టిన ఉగ్రవాది కసబ్ పాపం పండింది. అర్థరాత్రిపూట హఠాత్తుగా దాడి చేసి ముంబైలో మారణహోమం సృష్టించిన ముష్కరమూకలో ఒకడైన కసబ్‌ను ఏమాత్రం క్షమించలేమని సెషన్స్ కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపిన జస్టిస్ తెహిల్యాని.. గురువారం శిక్షను ఖరారు చేశారు. అదే.. మరణశిక్ష.
కసబ్‌కు మరణశిక్ష వేయడంతో ఈ కేసు వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్లో ఆనందం తాండవించింది. తీర్పు వెలువడిన అనంతరం ఆర్దర్రోడ్ జైలులోని కోర్టునుంచి ఉత్సాహంగా వచ్చిన నిఖమ్ విజయచిహ్నాన్ని చూపించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య విజయమన్నారు.కసబ్‌పై మోపిన 86 అభియోగాలు రుజువు కావడంతో.. వాటి ఆధారంగానే తీర్పు చెప్పారు తెహిల్యాని. ముఖ్యంగా దేశంపై యుద్దానికి తెగబడడం సహా.. నాలుగు కేసుల్లో ఉరిశిక్ష, 6 కేసుల్లో జీవిత ఖైదు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా.. తెహిల్యాని కొన్ని కామెంట్లు చేశారు. కసబ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజానికి పట్టిన చీడపురుగుగా కసబ్‌ను పోల్చారు. ముంబై దాడి గురించి చెప్పేందుకు మాటలు రావట్లేదన్న జడ్జి... కసబ్‌పై అణువంతైనా దయ చూపలేమన్నారు. కసబ్‌లో మానవత్వం చచ్చిపోయిందని.. మామూలు మనిషిగా మారడానికి ఏమాత్రం అవకాశం లేదన్నారు. టెర్రరిస్టు కావాలనుకునే కసబ్ లష్కరే తోయిబాలో చేరాడే తప్ప.. బలవంతంగా ఎవరూ చేర్పించలేదని తెహిల్యాని తన తీర్పులో పేర్కొన్నారు. అందుకే.. మరణశిక్ష తప్ప మరో శిక్షను వేయలేమన్నారు.
కసాయి కంట కన్నీరు
ప్రాణం పోయేదాకా.. గొంతుకు ఉరితాడు బిగించండంటూ.. జడ్జి తీర్పు చెప్పగానే.. కసాయి కసబ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రాణం ఎంత విలువైందో బహుశా.. ఆ క్షణంలో కసబ్‌కు అర్థమయ్యి ఉండొచ్చు. కానీ.. నిర్దాక్షిణ్యంగా.. విచక్షణారహితంగా చేతిలో AK-47తో తూటాల వర్షం కురిపిస్తూ దాదాపు 72 మందిని పొట్టన పెట్టుకున్న కసబ్‌కు ఉరిశిక్షే సరైన శిక్ష. ఈ భూమ్మీద జీవించడానికి ఏమాత్రం అర్హతలేని ఒకేఒక్క వ్యక్తి కసబ్. ఈ విషయమూ.. కసబ్‌కు తెలిసి ఉండొచ్చు. ఈ శిక్షపై అభిప్రాయమేమింటూ జడ్జి అడిగినా నోరు మెదపలేదు.
అతిపెద్ద తతంగం
ఉరిశిక్షను కోర్టు వేయగానే అమలైపోదు.. దానికి ఎన్నో అడ్డంకులు అధిగమించాలి. రకరకాల కోర్టులు దాటి.. రాష్ట్రపతిదాకా వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రపతికి కూడా మరణశిక్షే సబబని అనిపిస్తే తప్ప.. నేరస్థుడి మెడకు ఉరితాడు బిగుసుకోదు. ఒక్కోసారి.. ఉరిశిక్షకూడా తప్పిపోతుంది. ఇందంతా సంవత్సరాల తరబడి జరిగే ప్రక్రియ. తుదినిర్ణయం వచ్చేసరికి.. అసలు కేసును.. దాని గొడవను అంతా మర్చిపోతారు కూడా..
పదిహేనేళ్ల కాలంలో మనదేశంలో ఉరిశిక్ష అమలయ్యింది రెండే రెండు సార్లు. ఏప్రిల్ 27, 1995న చెన్నైకి చెందిన సీరియల్ కిల్లర్ ఆటో శంకర్‌ను ఉరితీశారు. ఆ తర్వాత.. ఆగస్టు 14,2004న కోల్‌కతాలో ధనుంజయ్ ఛటర్జీని ఉరికంబం ఎక్కించారు. ఆ తర్వాత ఉరితాడును వాడాల్సిన సమయం మళ్లీ రాలేదు. అంటే.. అప్పటినుంచి ఉరిశిక్షలేవీ పడలేదా.? కానేకాదు.. దేశంలో ఏదో ఓ కోర్టు.. ఎప్పటికప్పుడు ఉరిశిక్షను వేస్తూనే ఉంది.. కానీ అవి అమలుకు మాత్రం రావడం లేదు.. దీనికి కారణం మరెవరో కాదు.. చట్టమే.. చట్టంలో ఉన్న నిబంధనలే..
జిల్లాకోర్టులు కాని, సెషన్స్ కోర్టులు గానీ ఉరిశిక్ష ప్రకటించిన తర్వాతే.. అసలు ప్రొసీజర్ మొదలవుతుంది. ఈ శిక్షను నిర్దారించమని ప్రభుత్వం హైకోర్టును కోరుతుంది. అక్కడా ఉరిశిక్షను సమర్థిస్తే.. ఆ కేసు సుప్రీంకోర్టును చేరుతుంది. దేశఅత్యున్నత న్యాయస్థానమూ దీన్ని ధృవీకరిస్తే.. ఉరిశిక్ష వేయడం ఖరారవుతుంది. అప్పుడే ఉరితీసే తేదీని ప్రకటిస్తారు. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలంటూ.. సుప్రీంకోర్టును కోరవచ్చు. అప్పుడు కూడా.. సుప్రీం కోర్టు కరుణించకపోతే.. చివరగా.. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతిని ఆశ్రయించవచ్చు.
క్షమాభిక్ష పిటిషన్‌పై సలహా ఇవ్వమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రాష్ట్రపతి పంపిస్తారు. దీనిపై.. ఆ కేసుకు సంబంధించిన రాష్ట్రం నుంచి వివరణ కోరుతుంది హోంమినిస్ట్రీ. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత.. వాటిని పరిశీలించి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిస్తుంది. వీటి ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. ఉరిశిక్షను అమలు చేయమని ఆదేశించవచ్చు.. లేదంటే.. యావజ్జీవ కారాగారశిక్షగానూ మార్చొచ్చు. స్థానిక కోర్టుల నుంచి పై కోర్టులకు.. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు రావడానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. దీనివల్లే ఉరిశిక్ష అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కోర్టును ఉరిశిక్ష వేసినా.. కరుడుగట్టిన నేరస్తులు మాత్రం ప్రాణాలతో ఉంటున్నారు.
చావాల్సిన వారు బతికే ఉన్నారు
ఇప్పటికే.. 52 మందికి ఉరిశిక్షలు పడినప్పటికీ ఇంకా అమలు మాత్రం కాలేదు. సుప్రీంకోర్టు శిక్షను ఫైనల్ చేసిన తర్వాత వారంతా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. ఇందులో కాక ఉగ్రవాదులు,బందిపోట్లే.. 9 మంది ఉన్నారు. పైగా ఇవి ఒకటీ రెండేళ్ల కిందవి కూడా కాదు.. 1998 లో దరఖాస్తు చేసుకున్నవాటికే ఇంతవరకూ మోక్షం కలగలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్యకేసులో ఉరిశిక్ష పడిన శ్యాంమనోహర్, మరో ఐదుగురు 1998లో క్షమాభిక్షకు అర్జీ పెట్టుకున్నారు. 1999లో ఓసారి, 2005లో మరోసారి హోంశాఖ వీరి ఫైల్‌కు సంబంధించి సిఫార్సులు చేసింది. ఇటీవలే మళ్లీ ఆ ఫైల్‌ను వెనక్కి తెప్పించి పరిశీలిస్తోంది. పన్నెండేళ్లయైనా.. ఉరిశిక్ష వేయాలో వద్దో ఈ కేసులో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నమాట. టెర్రరిస్టుల విషయంలోనూ తీవ్రజాప్యమే జరుగుతోంది. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష పడ్డ మురుగన్, శాంతన్, అరివులకు.. 1999 మే నెలలో సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రెండువేల సంవత్సరంలో మెర్సీ పిటిషన్‌ను వీరు పెట్టుకున్నారు. ఈ కేసులో ఫైనల్ రికమండేషన్‌ను హోంశాఖ జూన్ 21, 2005న పంపించింది. ఐదేళ్లు గడుస్తున్నా.. రాష్ట్రపతి ఈ ఫైల్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తంమీద చూస్తే.. పదేళ్ల క్రితమే ఉరితీయాల్సిన రాజీవ్హంతకులని ఇప్పటికీ జైల్లో ప్రాణాలతోనే ఉంచారు. ఇక 1993 సెప్టెంబర్‌లో ఢిల్లీలో బాంబులు పేల్చిన ఖలిస్తాన్ తీవ్రవాది దేవిందర్ పాల్ సింగ్‌కు డిసెంబర్ 2002 లో సుప్రీం మరణశిక్ష విధించింది. 2003లో కరుణించమంటూ రాష్ట్రపతిని ఆయన వేడుకున్నాడు. ఆగస్టు 9, 2005న హోంశాఖ నుంచి సిఫార్సులు అంచాయి. అయినా.. ఈ ఫైల్‌కూ మోక్షం కలగలేదు. గంధపుచెక్కల దొంగ వీరప్పన్ అనుచరుడు సైమన్, మరో ముగ్గురుకి 2004 జనవరి 29న ఉరిశిక్ష పడింది. అదే ఏడాది రాష్ట్రపతిని శిక్ష తగ్గించమని ఆశ్రయించారు. 2005 మే2న హోంశాఖ ఈ ఫైల్‌ను రాష్ట్రపతి సెక్రటేరియెట్‌కు పంపించింది. దీన్ని కూడా పెండింగ్‌లోనే పెట్టారు. ఇక పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు 2005 ఆగస్టు4న సుప్రీంకోర్టు డెత్ సెంటెన్స్ విధించింది. 2006లో అఫ్జల్ మెర్సీపిటిషన్ పెట్టుకున్నాడు. ఈ ఫైల్ కేంద్రహోంశాఖ నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి చేరింది. అక్కడి నుంచి ఇంతవరకూ వెనక్కి రాలేదు. దీనిపై 14 లెటర్లు పంపించినా ఢిల్లీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అత్యంత ప్రమాదకర ఉగ్రవాదిగా భావిస్తున్న అఫ్జల్ గురుకు శిక్ష పడాలంటే.. ముందున్న 8మంది ఉగ్రవాదుల ఫైళ్లూ క్లియర్ కావాల్సి ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ప్రతీకైన పార్లమెంట్‌పైనే దాడిచేసిన ఉగ్రవాది విషయంలోనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటే.. మన ప్రభుత్వం ఈ విషయంలో ఎంత అలసత్వంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కసబ్ కూడా ఈ లిస్ట్‌లో చేరితే.. ఎంతకాలానికి శిక్ష పడుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఒక్కో కేసును క్లియర్ చేస్తామని చెబుతోంది.
టెర్రరిస్టులను పక్కన పెడితే .. హత్యకేసుల్లో ఉరిశిక్ష పడ్డ మరో 43 మంది రాష్ట్రపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి సంబంధించిన 23 ఫైళ్లు రాష్ట్రపతి భవన్లో మూలుగుతున్నాయి. మూడు కేసుల్లో మాత్రం ఇటీవలే హోంశాఖ తాజా సిఫార్సులు పంపించింది. ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఏదీ లేకపోవడంతో.. ఏళ్లతరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇక ఇప్పుడు కసబ్ కేసు కూడా రాష్ట్రపతిదాకా వచ్చేటప్పటికి ఎంతలేదన్నా ఏడాది నుంచి రెండేళ్లు పట్టొచ్చు. ఇక అక్కడ ఎన్ని సంవత్సరాలు పడుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు.
ఉరిశిక్షకూ.. రాష్ట్రపతికీ ఎమిటీ లింకు?
ఎలాంటి కేసులో అయినా.. సుప్రీంకోర్టు నిర్ణయమే ఫైనల్ అయినప్పుడు.. ఉరిశిక్షలో మాత్రం ఎందుకు కాదు.. అయితే.. దీనికి స్పష్టమైన నిర్వచనాన్నే ఇచ్చింది భారత రాజ్యాంగం. ఇతర శిక్షలతో పోల్చితే.. మరణశిక్ష అత్యంత ప్రమాదకరం. మనిషి జీవితాన్ని అంతం చేస్తుంది. ఒకవేళ కోర్టుల్లో సరైన విధంగా ప్రాసిక్యూషన్ జరగకపోతే.. ఉరిశిక్షతో ప్రాణం పోతుంది కాబట్టి.. ఆ సమస్య రాకుండా.. రాష్ట్రపతికి విశేషమైన అధికారాలను కట్టబెట్టారు రాజ్యాంగ నిర్మాతలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 క్షమాభిక్షకు సంబంధించి రాష్ట్రపతికి ఉన్న అధికారాలను ప్రస్తావిస్తుంది. కేంద్రమంత్రిమండలి సలహా ఆధారంగానే రాష్ట్రపతి క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఏ సందర్భాల్లో క్షమాభిక్ష పెట్టవచ్చో కూడా రాజ్యాంగం స్పష్టంగానే చెప్పింది. నేరస్తుడు యువకుడైనా,మహిళలైనా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు నేరాన్ని చేసి ఉండొచ్చని రాష్ట్రపతి భావిస్తే ఉరిశిక్ష తప్పించవచ్చు. శిక్ష వేయడానికి కారణమైన సాక్ష్యాలు విశ్వసించతగినవి కాదని భావించినా... మళ్లీ విచారణ జరిపితే కొత్త ఆధారాలు దొరుకుతాయని ఆశించినా.. శిక్ష విధించిన కోర్ట్ బెంచ్‌లో జడ్జిల మధ్య విరుద్దమైన అభిప్రాయాలున్నా.. సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగిందని భావించినా.. క్షమాభిక్షను రాష్ట్రపతి ప్రసాదించవచ్చు. దీనివల్ల.. ఉరిశిక్ష కాస్తా జీవితఖైదుగా మారిపోతుంది. ఈ పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. హోంశాఖ నిర్లక్ష్యంతో పాటు.. రాష్ట్రపతి భవన్లో జాప్యం వల్లా.. ఫైళ్లు పేరుకుపోతున్నాయి.
ఇప్పటికే ఆప్జల్గురు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. 2006లో మెర్సీ పిటిషన్‌ను ఆఫ్జల్ గురు పెట్టుకుంటే.. ఇంతవరకూ హోంశాఖ ఫైనల్ రికమండేషన్స్‌ను పంపించలేకపోయింది. ఓ కరుడుగట్టిన ఉగ్రవాదిని శిక్షను వేయకుండా నాలుగేళ్లుగా జైల్లోనే ఉంచారు. రాజకీయకారణాల వల్లే జాప్యం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం లెక్కచేయడం లేదు. ఈ ఆఫ్జల్ గురును విడుదల చేయించడానికి.. తీవ్రవాదులు మరో దాడి చేస్తే దానికి బాధ్యులెవరవుతారు.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పదు. కానీ.. ఈ విషయం కోర్టులకు బాగా తెలుసు. అందుకే.. కసబ్‌కు ఉరిశిక్ష వేసే విషయంలోనూ దీన్ని ప్రస్తావించింది. యావజ్జీవ శిక్షతో సరిపెడితే.. కాందహార్ హైజాక్లాంటి సంఘటనలు మళ్లీ జరగొచ్చన్న ఆందోళనను సెషన్స్ కోర్ట్ వెలుబుచ్చింది. అందుకే.. కసబ్‌కు ఉరిశిక్ష వేసింది. మరి సెషన్స్‌కోర్టు ఆలోచించినంత కూడా మన పాలకులు ఆలోచించరా..
మన దేశ పౌరుల విషయంలో క్షమాభిక్షను పెండింగ్‌లో ఉంచొచ్చేమో కానీ.. ఓ అఫ్జల్గురునో.. మరో కసబ్నో ఏమాత్రం క్షమించకూడదు. లైన్లు.. ఆర్డర్లు అంటూ.. వీరి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టకూడదు. వీలైనంత వెంటనే శిక్షను అమలు చేయాలి. లేదంటే.. ఏడాదిన్నర కాలంలోనే కసబ్‌కు 35 కోట్లు ఖర్చుపెట్టినట్లు.. వందల కోట్ల ప్రజాధనాన్ని ఆ ఉగ్రవాదిని పోషించడానికే ధారపోయాల్సి ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం
ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.
* ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
* ఇలాంటి మంచిని కోరే ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.
* హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి. ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.---ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).
*ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)
*బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష
ఉగ్రవాదులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.
*ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా
hope he will be executed quickly without any political interference. this is correct judgement
ఒక ఉగ్రవాదికి ఇంత సేపు చర్చలా మన ఖర్మ అండి .
Nrahamthulla గారు చాలా ధన్యవాదములు అండి మీకు.
మీరు ఒక్క సారి telugukingdom.net చూసి మీ అభిప్రాయం చెప్పగలరు
ఇట్లు
జ్యోతి
రహముల్లా గారు ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం అన్నారు. వ్యతిరేకమో , అనుకూలమో ఇస్లాం మీద చర్చ ఇక్కడ అనవసరం. తమరు చెప్పాల్సింది ఓ నేరస్థుడికి శిక్ష గురించి మాత్రమే. నేరస్థుడి మతం మీద ' ప్రచారం ' కాదు. ఇదేదో శవం మీద మరమరాలు ఏరుకోవడం లా వుంది. :) కాబట్టి ఆపండి మీ ఇస్లాం డబ్బా .. అల్లావుద్దీన్ ఖిల్జీ , ఘజనీ ఔరంగజేబుల నుంచి నిజాం , కరీం లాలా, దావూద్ ఇబ్రహీం , ఒవైసీ ల వరకూ మేము చూసింది ఉగ్ర వాదము, పరమత అసహనమే!
ప్రవక్తలే యుద్ధాలు చేసిన మతం ఇస్లాం , అవునా కాదా? కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుంది.
aurangajeb was not a fanatic muslim.athanu mathonmaadi ani evaru chepparu.ekkada chadivaano gurthuledu kanee aurangajeb matram islam prakaram jeevinchaadu anthe thappa athanu hinduvulanu peedinchaledandee.prasthutham manam chaduvuthunna charithra anthaa british valla hayam lo raasindi.adi mana madhya chichu pettadaaniki thappa vignanam penchukovadaaniki e matram upayogapadaledu.
@అజ్నాత
అన్ని మతాలలో యుద్ధాలున్నాయి.నరహంతకులే శవం మీద మరమరాలు ఏరుకుతింటారు.హింసకులకు మతం ఒక సాకు మాత్రమే.మానవత్వమే అన్నిటికన్నా మంచి జీవన మార్గం.లేఖనాలలో హింసను వ్యతిరేకించే వాక్యాలను మాత్రమే గుర్తుచేసుకుందాం.కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుంది అని ఎంతకాలం కడుపులోనే అశుద్ధాన్ని మోయటం?ఇలాంటి కిరాతకులను ఎవరూ సమర్దించరు.ఉగ్ర వాదము , పరమత అసహనం మీద ఎంత చర్చ జరిగితే అంతమేలు.
ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, వెధవలు అన్ని మతాలలో ఉన్నారు అంటే ఒప్పుకొంటాను కాని, మతాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్లను హిసించటం, ఒకటికి వంద పెళ్ళిళ్లు చేసుకోవటం, ఉగ్రవాదానికి ఊతం ఇవ్వటం మాత్రం ప్రస్తుతం జరుగుతున్నది ఇస్లాం మతం లోనే ఎక్కువ అది నిజం, ముందు అది ఒప్పుకొందాం.
ఆ తర్వాత, పైన ఎవరో (కుహానా)లౌకిక వాది "ఔరంగజెబ్ మత్రం ఇస్లం ప్రకరం జీవించాదు అంథె థప్ప అథను హిందువులను పీదించలెదందీ" అదంతా బ్రిటీషోళ్ల కుట్ర అని అంటున్నారు, అలాగయితే ఇతరమతాల గుళ్లు గోపరాలు, అందులోని విగ్రహాలు పగలగొట్టమని ఇస్లాం బొధించిదెమో చెప్తారా? సరే అలాగే బొధించింది అంటే అది గొప్ప మతమా? పోనీ ఆ విగ్రహాలు బ్రిటీషోళ్లె పగలగొట్టారంటారా?
ఎందుకండీ ఈ కుహానా వాదాలు, మిమ్ములను మీరు ఎందుకు మోసం చేసుకోవటం, మీ మాటలు నమ్మి "నిజాం మంచి రాజు" అని ముక్కోడు అన్నట్లు, మిగతావాళ్లు ఔరంగజేబు ఎదీ పడగొట్టలేదు, ఎవరినీ చెర పట్టలేదు, "మంచి రాజు" అని మొదలెడతానికా, ఇప్పటికే మొదలెట్టకపోతే!! మంచిని మంచి అందాము, చెడును చెడు అందాం అంతే కాని అసత్యాలు మాత్రం లౌకికవాదం పేరుతో ప్రచారం మతి చెడిన మేతావులు లాగా ప్రచారం చేయకండి.
aurangajeb e karanam chetha varanaasi loni visvesvarunu gudi koolagottaro meeku thelusunaa.kuhanaa loukikavaadi ani antunnaaru.loukika vaadam perutho nannu nenu eppudoo mosam chesukoedandee.indore raani ni pandaa lanunchi kapaadataanike aayana aa gudi koola gottinchaadu.if u have any queries pls study the history thoroughly.alaa ayithe e matham goppado cheppandi.prathee daanilo manchee chedoo annee unnaayi.matham eppudoo manche bodhinchindi kanee daanni paatinche vaalla valla thappudaari pattindi ani cheputhaanu nenu.madhyalo vachchina konni aachaarala valla anni mathaaloo bhrashtupattipoyaayi .
వెధవలు అన్ని మతాలలో ఉన్నారు.మతాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్లను హిసించమనీ, ఒకటికి వంద పెళ్ళిళ్లు చేసుకోమనీ , ఉగ్రవాదానికి ఊతం ఇవ్వమనీ,ఇతరమతాల గుళ్లు గోపురాలు, అందులోని విగ్రహాలు పగలగొట్టమని ఇస్లాం బోధించిందా?సతీ సహగమనం లాంటి అనేక దురాచారాలను హిందూ మతం సరిదిద్దుకుంది.అలాగే ఇస్లాంమతంలో కూడా నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి.మంచికోసం మనుషులు కదులుతారు కానీ ఎవడో చేసిన పాడుపనుల మచ్చలను ఈనాటి అమాయకులు మోయరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.
అఫ్జల్ గురు, కసబ్ లాంటి దేశద్రోహులకు కోర్టులు ఉరిశిక్ష విధించినప్పుడు వెంటనే ఉరితియ్యాలి.ఉరితీస్తే ముస్లీములు ఏమీ "ఫీల్" కారు.అవుతారేమో అనే అనుమానం నేతలకు రావడమే తప్పు."హిందు టెర్రరిజం" వస్తే ఈ దేశంలో ముస్లీములు మిగలరు.ఇరువర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.సామాన్యప్రజల్లో తొంభైతొమ్మిది శాతం మంది మంచివాళ్ళే.
తీవ్రవాదులకు, ముస్లీంలకు లేనిపోని లింకులు చుట్టి, భారతీయ ముస్లీములను మననేతలే అవమానిస్తున్నారు.వారి దేశభక్తిని, చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు.