1, మే 2010, శనివారం
సింహా.. ప్లస్సూ..మైనస్సూ.. ఓ కొసమెరుపు
సినిమా థియేటర్లలో సింహా సందడి మొదలయ్యింది. భారీ డైలాగ్స్‌తో పవర్ఫుల్ ప్యాకింగ్‌తో సింహాగా వచ్చిన బాలయ్య అంచనాలను అందుకున్నాడు. సినిమా రిలీజ్‌కు ముందే మంచి పాజిటివ్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. టికెట్ల కోసం.. థియేటర్ల ముందు నందమూరి అభిమానులు బారులు తీరారు. ఫస్ట్‌టాక్ కూడా అద్భుతంగా ఉండడంతో.. ఇక కలెక్షన్ల వర్షం కురువడం గ్యారెంటీగానే కనిపిస్తోంది
ఇక సినిమా స్టోరీలో బాలయ్యది డ్యూయల్ రోల్. తండ్రీకొడుకులుగా బాలయ్య తన నటవిశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడు. ఇంతకుముందు సినిమాలతో పోల్చితే.. గెటప్ విషయంలో చాలా కేర్ తీసుకోవడంతో.. రెండు పాత్రలూ సినిమాలో పండాయి.
యంగ్ బాలకృష్ణ ఓ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. బాలయ్య కొలీగ్ నమిత. స్టూడెంట్ స్నేహా ఉల్లాల్. హీరోను ఆకర్షించడానికి.. ప్రేమాయణం సాగించడానికి నమిత తెగ ట్రై చేస్తుంటుంది. ఇంతలో.. ఓ ప్రమాదం నుంచి స్నేహా ఉల్లాల్‌ను కాపాడి ఇంటికి తీసుకువెళతాడు బాలకృష్ణ. అప్పుడే ఓ పెద్ద ఫైట్.. హీరోయిన్ తండ్రి కత్తితో హీరోను పొడవబోతే.. అది కాస్తా.. బాలయ్య నానమ్మ కడుపులో గుచ్చుకుంటుంది.. అక్కడి నుంచే సినిమాలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.
తన తండ్రిని చంపిన విలన్‌ను యంగ్ బాలకృష్ణ చంపడంతో సినిమా ముగుస్తుంది. చివరకు మరి బాలకృష్ణ ఎవరితో జోడీ కట్టాడనేనా మీ డౌట్.. ఆ సస్పెన్స్ ఇక్కడే చెప్పేస్తే ఎలా.. సినిమాలోనే చూసి థ్రిల్ అవ్వండి..
ప్లస్ పాయింట్స్..
బాలకృష్ణ గెటప్స్. డాక్టర్ రోల్ కోసం తీర్చిదిద్దిన మీసకట్టు.. గాంభీర్యం.. కాస్య్టూమ్స్ బాలయ్య గ్లామర్‌ను మరింత పెంచాయి. సినిమా మొత్తానికి ఆ క్యారెక్టరే ప్రాణం. నయనతార గ్లామర్ ఒలికించకపోయినా.. పాత్రలో జీవించింది. కాస్య్టూమ్స్ అదిరిపోయాయి. పరుచూరి బ్రదర్శ్ సినిమాకు దూరంగా ఉండడమూ మేలు చేసిందనే చెప్పొచ్చు. అనవసరమైన, అతి డైలాగ్‌లు సినిమాలు కనిపించవు. అన్నీ పంచ్డైలాగ్సే. సెకండాఫ్ ఫస్ట్ అటాక్‌లోనే విలన్ తమ్ముడిని చంపబోతాడు సీనియర్ బాలకృష్ణ. నేనెవరో తెలుసా? అంటూ వాడు చెప్పిన డైలాగ్‌కు బాలయ్య విసిరిన పంచ్.. "అర నిముషంలో చచ్చేవాడివి నీ అడ్రస్ నాకెందుకురా? " ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి. సినిమాలో వేస్ట్ క్యారెక్టర్లు ఏవీ కనిపించవు.
ఇక డ్యాన్స్ విషయంలోనూ చాలాకష్టపడ్డాడు బాలయ్య. చాలా కష్టమైన స్టెప్పులు చేశాడు. పర్సనాలిటీ కూడా బాగా తగ్గించుకుని.. మంచి జోష్‌తో ఉన్నట్లు కనిపించాడు. పాటలు చూస్తే.. డ్యాన్స్ చేసింది బాలయ్యేనా అన్న డౌట్ కూడా వస్తుంది.
మైనస్ పాయింట్స్..
హెవీ వయలెన్స్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడిలని మించి రౌడీలను ఈ సినిమాలో నరికాడు బాలయ్య. రక్తంతో వెండితెర తడుస్తుంది. ఇక యంగ్ బాలకృష్ణ మేకప్ విషయంలో కాస్త అశ్రద్ధ చేసనట్లు కనిపిస్తుంది. గొంతు దగ్గర.. మొఖంపైనా ముడతలు కనిపిస్తుంటాయి. సాంగ్స్కూడా మూడు పాటలు తప్ప మిగిలినవి యావరేజే. క్లైమాక్స్‌కు చేరువవుతూ.. సీరియస్‌గా కథనం సాగుతున్నప్పుడు.. జానకి జానకి పాట పెట్టడం విసుగు తెప్పిస్తుంది.
విలన్ గుండాలు ఓ ఊరిమీద పడి మగాళ్లందరినీ చంపేసి.. ఓ బాయిలో పడేసి కప్పెడతారు. అయితే.. ఈ కప్పెట్టే సీన్‌ను సెన్సార్ కట్ చేసింది. చివరకు విలన్‌ను కూడా చంపి బావిలో పడేస్తే.. జనమంతా మట్టి పోసి కప్పెడతారు. బహుశా క్లైమాక్స్‌లో ఈ రెండింటికీ పోలిక చూపిద్దామని భీమనేని భావించినట్లున్నారు. కానీ.. సెన్సార్ కట్‌తో ఆ అవకాశం లేకుండా పోయింది. ఇదొక్కటే కాస్త లోటుగా కనిపిస్తుంది.
కొసమెరుపు
బాలకృష్ణ పాత సినిమాలను తలపిస్తూ.. చివర్లో సుమోలను గాల్లోకి ఎగరడం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
simha ku HIMSA ane title aite baga suite avuddi...... blog lo nijalu matrame rayali sir
saimha ku anta cn ledu...........