28, ఏప్రిల్ 2010, బుధవారం
వ్యభిచారం తప్పుకాదా... సౌమ్యకు సమాధానం
తప్పో ఒప్పో అన్న సంగతి పక్కన పెడితే.. తెలుగు బ్లాగుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వ్యభిచారం వృత్తెందుకు కాదంటూ.. కత్తి మహేశ్‌కుమార్ చేసిన కామెంట్‌కు వివాహాభోజనంబులో తన అభిప్రాయాలను ఏ మాత్రం మొహమాటపడకుండా సౌమ్యగారు ప్రకటించారు. వీరిద్దరికీ ధన్యవాదాలు. సౌమ్య ఆర్టికల్‌కు వచ్చిన కామెంట్లు.. వాటిపై జరుగుతున్న డిస్కషన్ చదివిన తర్వాత.. అక్కడ నా అభిప్రాయాన్ని పెడితే అందరికీ చదివే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే ఈ టపా రాస్తున్నాను.
వ్యభిచారాన్ని లీగలైజ్ చేయకూడదని సౌమ్యగారు అన్నారు. ఈ వాదనను ఎవరైనా సమర్థించాల్సిందే. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు బార్ షాపులు వెలిసినట్లు.. ప్రతీ వీధిలోనూ ఓ బ్రోతల్ హౌస్ తెరుస్తారు. ఇప్పటివరకూ రహస్యంగా సాగుతున్న శరీర వ్యాపారం(ఇంగ్లీష్‌లో ఫ్లెష్ ట్రేడ్) పబ్లిక్‌గా మొదలవుతుంది. పోటీ ఎక్కువైతే.. నీచాతి నీచంగా ప్రకటనలూ ఇచ్చి మరీ ఆకర్షిస్తారు (వ్యభిచారాన్ని లీగలైజ్ చేసిన దేశాల్లో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే). మద్యంకన్నా అతిపెద్ద వ్యాపారంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఇక.. వ్యాపారాన్ని పెంచుకోవడానికి.. కొత్త కొత్త అమ్మాయిలను వృత్తిలోకి దింపడానికి వ్యభిచార ముఠాలు ఎన్ని దౌర్జన్యాలు చేస్తారో ఊహించుకోవచ్చు.
వ్యభిచారాన్ని లీగలైజ్ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య జరిగే ఒప్పందం తెగిపోతుంది.. భార్య మోసం చేయబడుతుందని సౌమ్యగారు ఆవేదన వ్యక్తం చేశారు. కరెక్టే.. కానీ.. లీగలైజ్ చేయకపోయినా మన దేశంలో అతిపెద్ద వ్యాపారం సెక్స్ట్రేడే. ఢిల్లీ, ముంబై, గోవా, కోల్‌కతాల్లో.. వేల సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్నారు. మనదేశంలో వ్యభిచారం చట్టబద్దం కాకపోయినా.. చాలాచోట్ల ప్రత్యేకంగా రెడ్‌లైట్ ఏరియాలు ఉన్నాయి. గోవాలోని సెక్స్ వర్కర్లలో 80 శాతం మంది మనరాష్ట్రం వారే అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లీగలైజ్ చేసినా చేయకపోయినా.. వ్యభిచారులు ఉన్నంతకాలం.. మగవాళ్లు వారిని పోషిస్తూనే ఉంటారు. ఇంట్లో భార్య ఉన్నారహస్యంగా ఎఫైర్లు పెట్టుకునే వారు ఎంతమంది లేరు.. ఇక విదేశాల్లో సమానత్వం గురించి మాట్లాడారు. అందరినీ ఒకే గాటన కట్టేయలేం కానీ.. భర్త నచ్చకపోతే.. అతనితోనే కాపురం చేసే పరిస్థితిలో మాత్రం ఇప్పటి స్త్రీలు లేరు. అవసరమైతే విడాకులు తీసుకుంటున్నారు. లేదంటే నచ్చినవారితో కలిసి ఉంటున్నారు. పేపర్లు, టీవీలు చూస్తే.. ఇలాంటి వార్తలు మనకు చాలా కేసుల్లో కనిపిస్తాయి. (ఇది అందరినీ ఉద్దేశించింది కాదు... కొందరిని మాత్రమే, ఎవరైనా బాధపడితే క్షమించండి)
ఆడవాళ్లకు కోర్కెలు తీర్చుకునే ఉద్దేశం లేదనే మీ వాదన అసలు పసలేనిది. దీనికి కారణం పై లైన్లలోనే చెప్పాను. ఇక హైదరాబాద్‌లోనే చూస్తే.. హైటెక్ వ్యభిచార ముఠాల్లో దొరికేవారంతా కాలేజ్ స్టూడెంట్లు, పెళ్లికాని వారేనన్న విషయాన్ని మీరు గుర్తించాలి. పైగా.. ఒక్కో కాల్‌కు రెండు నుంచి 5 వేల వరకూ వసూలు చేస్తారు. వీరంతా సులువుగా డబ్బు సంపాదించడం కోసం చేస్తున్నవారే. వారికి ఇష్టమైనప్పుడు మాత్రమే కాల్స్‌కి అటెండ్ అవుతారు. పెళ్లికాని కుర్రాళ్ల కన్నా.. వ్యభిచారాన్ని అనుభవిస్తోంది అమ్మాయిలే. అంతేకాదు.. హైటెక్ కల్చర్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మసాజ్ సెంటర్లలో అబ్బాయిలతో ఎంజాయ్ చేసేవారికీ మన దగ్గర కొదవలేదు. (ఇదీ అందరినీ ఉద్దేశించి కాదు)
వేశ్యావృత్తిని నిర్మూలించాలన్న మీ మాటకు నేను గౌరవమిస్తాను. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బుతో మభ్యపెట్టి ఎక్కువమంది మహిళలను ఈ రొంపిలో దించుతున్నారు. ఒకసారి అలవాటు పడ్డాక.. అందులోనుంచి వారు బయటపడలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ప్రతీ ఏటా దాదాపు 30 లక్షలకు పైగా మహిళలు ట్రాఫికింగ్‌లో చిక్కుకుంటున్నారు. ఇందులో ప్రధాన వాట మన దేశానిదే. ఏటా ఇలా మహిళల అక్రమరవాణా ద్వారా జరుగుతున్న వ్యాపారం.. దాదాపు 37 వేల కోట్ల రూపాయలు. ముఖ్యంగా.. మన దేశంలో చూస్తే.. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బీహార్, ఒరిస్సా, ఢిల్లీల నుంచే ఎక్కువగా మహిళలను ఇలా తరలిస్తున్నారు.
చట్టబద్ధం లేకపోవడం వల్లే ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతోందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ చట్టబద్దమైతే కలిగే దుష్పరిణామాలే ఎక్కువ. ఇక లైంగిక సంబంధాలపై పురుషుల ఆలోచనా ధృక్పథం మారాల్సి ఉంటుంది. తాను నీతిగా ఉన్నంతవరకే తన భార్యకూడా ఉంటుందన్న విషయం తెలుసుకుంటే ఎవరూ అడ్డదారులు తొక్కరు. తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడరు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అనాదిగా ఈ వృత్థి కొనసాగుతోంది. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న కాలంలోనూ... కడుపు నింపుకోవడానికి పడుపు వృత్తిని ఆశ్రయించేవారి సంఖ్య వేలల్లో ఉందంటే.. అది నిజంగా అందరికీ సిగ్గుచేటే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
21వ శతాబ్దంలో మనం నేర్చుకున్న నాగరిక ఏమిటి? ముక్కూమొహం తెలియనివాళ్ళతో పడుకుని కుతి తీర్చుకోవడం నాగరికమా?
అ౦టే ముక్కు మొహ౦ తెలిసిన వాళ్లతో కుతి తీర్చుకు౦టే తప్పులేదన్న మాట!! హన్నన్నా!!!
అసలు మహేష్ ఎమన్నా అన్నాడ౦టే, దానికి తిరుగు టపా రాసినోదిమిడ కేసేయ్యాలి. ఈ సారి మళ్లీ అడుగుతున్నా, అసలు అనేక శ్రమలతో కూడుకున్న వ్యభిచార౦, దొ౦గతన౦, దోపిడీ లా౦టి వాటిని వృత్తులుగా ఎ౦దుకు చుడకుడదో కాస్త వివర౦గా వ్రాయ౦డి.
>> మన దేశంలో అతిపెద్ద వ్యాపారం సెక్స్ట్రేడే.
టంగుటూరి మిరియాలు!
pl. tell that to TATAs & Ambani's. They will open their shops!
మీటపా చూసానండీ. సమయాభావం వల్ల మీకు కామెంటు రాయలేకపోయాను. మీ ప్రశ్నలకి సమాధానాలు నా బ్లాగులో ఇచ్చాను. మళ్ళీ వాటిని క్రోడీకరించి ఇక్కడ రాసే ఓపిక లేదు, మీరు అక్కడ చదివేసుకోండి. నా టపా మీ చేత ఇంకో టపా రాయించినందుకు ముదావహం. నా పాయింట్లని కొంతవరకైనా అంగీకరించినందుకు thanks.