24 గంటలు నిత్యం చదివే నెటిజన్లందరికీ శుభవార్త. నేను రూపొందించిన తప్పెవరిది? ఎపిసోడ్‌కు కరెంట్ ఎపైర్స్ కేటగిరీలో నేషనల్ టెలివిజన్ అవార్డు వచ్చింది. తెలుగు టెలివిజన్ ఛానల్స్‌లో మొత్తం 22 కేటగిరీలకు గానూ ఈసారి ఎన్‌టి అవార్డులు ఇస్తున్నారు. రెండు మూడు ఛానల్స్ మినహా తెలుగు న్యూస్ ఛానల్స్ అన్నీ ఈ అవార్డులకోసం నామినేషన్లు వేశాయి. కరెంట్ ఎఫైర్స్ కేటగిరీలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిలో.. జీ 24 గంటలు నుంచి నేను రూపొందించిన జీ స్పెషల్ తప్పెవరిది?, టీవీ 9 నుంచి కోపెన్‌హాగన్‌పై రూపొందించిన 30 మినిట్స్, మహా టీవీ నుంచి ఇన్‌సైడ్ కార్యక్రమాలు ఫైనల్స్‌లో పోటీ పడ్డాయి. చివరకు అవార్డు మాత్రం జీ 24 గంటలుకే దక్కింది. దీన్ని ఈరోజు ఢిల్లీలో ప్రధానం చేస్తున్నారు. ఇక జీ 24 గంటలకు బెస్ట్ డిస్కషన్ కేటగిరీలో బిగ్ స్టోరీకి కూడా అవార్డు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో యువత పాత్ర అనే దానిపై జరిగిన చర్చకు గానూ ఈ అవార్డు వచ్చింది. మొత్తం 13 మంది జడ్జిలతో కూడిన ప్యానెల్ ఈ అవార్డులను ఎంపిక చేసింది. తప్పెవరిది పేరిట ప్రసారమైన ఐటెం వీడియో లింకులను ఇదివరకే 24గంటల్లో పెట్టడం జరిగింది.
ఆ లింకు..
http://www.24gantalu.co.cc/2009/12/blog-post_7277.html
25, మార్చి 2010, గురువారం
తప్పెవరిదికి? నేషనల్ అవార్డు..
Categories :
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Congratulations.
My Hearty Congratulations
Ali
అభినందనలు,మీరు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని అభిలషిస్తూ..
మీ మిత్రుడు
రాజేంద్ర
Congratulations for your personal achievement.
I don't agree with your seperation theory. Smaller States concept is irrational.
అభినందనలు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు
అభినందనలు....keep it up.