24, ఫిబ్రవరి 2010, బుధవారం
సింప్లీ సచిన్...
వన్డే క్రికెట్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. గ్వాలియర్ టెస్టులో మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన మహోగ్ర రూపాన్ని ప్రదర్శించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లలతో పరుగుల సునామీ సృష్టించాడు. వన్డే చరిత్రలో తొట్టతొలి డబుల్ సెంచరీ నమోదుచేశాడు. ఇంతవరకు ఉన్న రికార్డులను తిరగరాస్తూ... వన్డేల్లో 200 పరుగులు చేసిన మొదటి ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. సచిన్ ఇదివరకు హైదరాబాద్లోనే 186, 175 పరుగులు చేశాడు. ఇక వన్డేల విషయానికొస్తే జింబాబ్వే ఆటగాడు కొవెంట్రీ, పాక్ ప్లేయర్ సయీద్ అన్వర్‌లు చెరో 194 పరుగులు చేశారు. క్రికెట్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ రిచర్డ్స్, జయసూర్యలు కూడా 189 పరుగుల చొప్పున సాధించారు. ఆ రికార్డులను మాస్టర్ బ్లాస్టర్ చెరిపేశాడు.డబుల్ సెంచరీ సాధించాడు.. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించినా.. ఇప్పటివరకూ వన్డేల్లో డబుల్ మాత్రం సచిన్‌ను ఊరిస్తూనే ఉంది. దక్షిణాఫ్రికాతో రెండోవన్డేతో ఆ లోటు కూడా తీరిపోయింది. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సెంచరీలు ఇప్పుడు సచిన్‌వే.. అంతేకాదు.. డబుల్ కొట్టిన ఏకైక మొనగాడు కూడా సచినే. అయినా.. సింపుల్‌గానే ఉంటాడు.. మన సింప్లీ సచిన్. అందుకే.. లిటిల్ మాస్టర్ కాదు.. ఇకపై గ్రేట్ మాస్టర్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SACHIN IS GOD..