24, ఫిబ్రవరి 2010, బుధవారం
టాలీడ్రగ్స్..
మొన్నటి వరకూ బాలీవుడ్‌కే పరిమితమయిన డ్రగ్స్ మాఫియా ఇప్పుడు టాలీవుడ్‌కూ విస్తరించింది. తెలుగుతెరకు పరిచయం ఉన్న హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదకద్రవ్య బాగోతం బట్టబయలు కావడంతో టాలీవుడ్ షాక్ తిన్నది. ఈ కేసును తవ్వుతున్న పోలీసులకు నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో టాలీవుడ్ వణికిపోతోంది.
వినోద కేంద్రాలే అడ్డాలుగా..
రెండు రోజుల క్రితం పోలీసులకు చిక్కిన నిర్మాత కామి నేని వెంకటేశ్వరరావు ఉదంతంతో తెలుగు సినీ పరిశ్రమ లో కొందరు మత్తుమందుల వ్యాపారం నిర్వ హిస్తున్నట్లు తేటతెల్లమైంది. ఈ వ్యాపారంలో మరికొంత మంది సినీ ప్రముఖులున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తు న్నారు. రాజధాని నగరంలోని పబ్‌లకు సినీ హీరో, హీరో యిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఉన్నతవర్గాలకు చెందిన వారే ఎక్కువగా వెళ్తుంటారు. గతంలో బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఓ పబ్‌లో ఒక హీరోయిన్ హీరోకు మధ్య ముద్దు ఇచ్చే విషయంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే.
బేగంపేట ప్రాంతంలో ఉన్న ఒక పబ్‌లో మద్యం మత్తెక్కిన యువతులు అర్థరాత్రి ప్రియుడి కోసం కొట్టు కోగా... పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించిన విషయమూ తెలిసిందే. అపార్ట్‌మెంట్లు, ఇతర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేసే వారిపై పోలీ సులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తుండగా.... పబ్‌లు, ఐదు నక్షత్రాల హోటళ్ళలో జరుగుతున్న లక్షలాది రూపాయల వ్యభిచారాన్ని అడ్డుకునే వారు మాత్రం కనిపించడం లేదు. ఉన్నత వర్గాల వారు వ్యభిచారానికి, మాదకద్రవ్యాల వినియోగానికి వీటినే స్థావరాలుగా వినియోగించుకుంటున్నారు.
మత్తు మందుల వాడకం, సరఫరాలో సినీ పరిశ్రమ తూలుతోంది. సినిమా అవకాశాలు తగ్గి, పబ్బులు, క్లబ్బులు పెట్టుకుంటున్న సినీ ప్రముఖులు అడ్డదారిలో సంపాదనకు తెగబడుతున్నారు. తమ పబ్బులకు వచ్చే యువతీ యువకులకు డ్రగ్స్ సరఫరా చేసి కోట్లు సంపాదిస్తున్న వైనం తెలిసినా పోలీసులనిఘా నేత్రాలు తెరవకుండా, వారు సైతం మా మూళ్ల మత్తులో మునిగిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు గోడల మధ్య రారాజులుగా చెలామణి అవుతూ, అవే తమ సామ్రాజ్యాలుగా భావిస్తున్న సినీ ప్రముఖుల అక్ర మ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై కన్నేసేందు కు పోలీసులు వెనుకంజవేస్తున్నారు. వారికి ఉన్న పలుకుబడి చూసి పోలీసులు వెనక్కిత గ్గుతున్నా రు. సామాన్యులను పోలీసుస్టేషన్లకు తీసుకువచ్చే పోలీసులు, సినీ ప్రముఖులను మాత్రం వారి గడప నుంచి కూడా బయటకు తీసుకువచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు.
సినీ పరిశ్రమ ప్రముఖులు డ్రగ్స్ వ్యాపారాల్లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వైనం వెలు గులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా సినీ నిర్మాత కామినేని వెంకటేశ్వరరావు, శ్యాంరాజు మాదక ద్రవ్యాల రవాణా కేసులో అరెస్టు కావడం మత్తు మందుల వ్యవహారంతో సినీ పరిశ్రమకు ఉన్న లింకు వెలుగు చూసింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలను విచారిస్తోన్న పోలీసులకు తవ్వేకొద్దీ విభ్రాంతి కలిగే వాస్తవాలు ఒక్కొక్కటే బయటపడుతు న్నాయి. ఇంకా నలుగురైదురు యువ హీరోలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. ఈ వివరాలను కేవీ రావు పోలీసుల ఇంటరాగేషన్‌లో స్పష్టంగా వెల్లడించినట్లు తెలు స్తోంది. ప్రస్తుతం పట్టుబడ్డ డ్రగ్స్ ఖరీదును పోలీసులు తక్కువగా చూపిస్తున్నప్పటికీ, విదేశాల్లో వాటి ఖరీదు కోట్ల రూపాయలలోనే ఉన్నట్లు చెబుతున్నారు.
ఇంటరాగేషన్‌లో కేవీ రావు వెల్లడించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. యువ హీరో తరుణ్, గతంలో మెగాస్టార్ చిరంజీవికి మేనేజర్‌గా, ప్రస్తుతం రవితేజ, సునీల్ వంటి ప్రముఖులకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న సినీ నటుడు రాజారవీంద్ర, హీరో రవితేజ సోదరుడు రఘు, నిర్మాత బెల్లం కొండ సురేష్ పేర్లు పోలీసుల ఇంటరాగేషన్‌లో వెలుగుచూసి నట్లు తెలుస్తోంది. ఆమేరకు సినీ పరిశ్రమలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.
తరుణ్ చాలాకాలం నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఎదురుగా ఒక పబ్ నిర్వహిస్తున్నా రు. అందులో చాలాకాలం నుంచి డ్రగ్స్ సరఫ రా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిజానికి సినిమాలు లేక పబ్ పెట్టిన తరుణ్‌కు ఈ వ్యాపా రం లోనూ నష్టం వచ్చి, ఒకదశలో మూసివేసే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. అయితే, ఈలోగా డ్రగ్స్ వ్యాపారంపై దృష్టి సారించి, కేవీ రావు అరెస్టు పుణ్యాన మళ్లీ వెలుగులోకి వచ్చారు.
సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలతో పాటు.. హీరోయిన్లు, క్యారక్టర్ ఆర్టిస్టులతో ‘సన్నిహిత సంబంధాలు’ ఉన్న రాజారవీంద్ర పేరు కూడా ఇంటరాగేషన్‌లో వెలుగుచూసినట్లు సమా చారం. ఇక గతంలో బాలకృష్ణతో ‘లక్ష్మీనర సింహ’ పాటు.. ఇటీవల రవితేజ, నరేష్‌లతో ‘శంభోశివశంభో’ సినిమా తీసిన నిర్మాత బెల్లం కొండ సురేష్ పేరు కూడా ఇంటరాగేషన్‌లో దొర్లినట్లు సమాచారం. అయితే, ఆయన దీనిని ఖండిస్తున్నారు. శంభో శివశంభోలో వాడిన ఏపీ 28 సీసీ 4840 నెంబరు ఉన్న వాహనం లోనే మాదక ద్రవ్యాలు పట్టుపడ్డాయి.
అయితే తాను వాడిన ఆ వాహనం ట్రావెల్స్ నుంచి అద్దెకు తీసుకున్నా నని చెబుతున్నారు. ఆయనతో పాటు.. హీరో రవితేజ సోద రుడు రఘు పేరు కూడా పోలీసుల విచారణలో బయటపడి నట్లు తెలిసింది. ఇదిలాఉండగా.. డ్రగ్స్ వ్యవహారంలో మరో నలుగురు బిజీ హీరోల పేర్లు కూడా సినీ పరిశ్రమలో చర్చకు వస్తోంది. విచారణలో వెల్లడైన వారితో సదరు హీరో లకు సన్నిహిత సంబంధాలున్నట్లు, వారిలో ఇద్దరు యువ హీరోలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా తరచూ ‘ఉమ్మడి కార్యక్రమాల్లో’ పాల్గొంటారని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
14 రోజుల రిమాండ్
మాదాపూర్ : డ్రగ్స్ రాకెట్‌లో పట్టుబడ్డ తెలుగు సినీ నిర్మాత కామినేని వెంకటేశ్వరరావు, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన భోజరాజుశ్యాం రాజును మాదాపూర్ పోలీసులు సోమవారం మియాపూర్ కోర్టులో హాజరు పరచగా 14రోజుల పాటు రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దుబాయ్ టు హైదరాబాద్ !
తెలుగు సినీ పరిశ్రమతో డ్రగ్స్ మాఫియాకు లింకు బయటపడిన నేపథ్యం లో.. మరికొన్ని సంచలన వార్తలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు చెబుతున్న ప్రకారం డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన డబ్బు దుబాయ్ నుంచి వస్తున్నట్లు సమాచారం. దీనికి ‘ధర్మకర్త’లు తెలుగువారే అయినప్పటికీ, దుబా య్ నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సినీ పరిశ్రమలో జోరుగా ప్రచారం జరు గుతోంది. దుబాయ్ నుంచి మహారాష్ట్ర, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా హైదరా బాద్‌కు డబ్బులు చేరుతున్నట్లు చెబుతున్నారు. అక్కడి నుంచి వచ్చిన డబ్బుతోనే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పేరు రాయడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారం గత మూడేళ్లుగా జరుగుతోందని చెబుతున్నారు.
లెక్కల్లో తేడాలొచ్చే..
కాగా, పోలీసులు-సినీ పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం.. డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూడటానికి పంపకాల్లో వచ్చిన లెక్కల తేడాలే కారణమని చెబుతున్నా రు. వెంకటేశ్వరరావుకు, ఇదే కుంభకోణంలో ఉన్న మరో నిర్మాతకు లెక్కల్లో సుమారు రూ. 8 కోట్లు తేడా వచ్చినట్లు సమాచారం. ఆ లెక్క కుదరకనే గతం లో జరిగిన ఒక ఘటనలో ప్రాణాపాయం నుంచి బయటపడిన నిర్మాత ఈ వ్య వహారాన్ని పోలీసులకు ఉప్పందించినట్లు చెబుతున్నారు. నిజానికి ఈ ముఠాను పోలీసులు పదిరోజుల క్రితమే అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందుతుడి సతీమణి రెండేళ్ల క్రితం దొంగనోట్ల కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతోంది. ఆమె కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసిన తన భర్త ఉన్న మాదా పూర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మాట్లాడింది. ఆ తర్వాత ఒక టీవీ ఛానెల్ వద్దకు వెళ్లి తన భర్తను పోలీసులు హింసిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది
(సూర్య సౌజన్యంతో)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి