తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణ భగ్గుమంది. విద్యార్థులు, ప్రజలు ఆందోళన బాట పట్టగా, ప్రజాప్రతినిధులు రాజీనామా బాట పట్టారు. దీంతో కేంద్ర మంత్రి సీమాంధ్ర ఎంపీలతో ఆర్థరాత్రి హడావిడిగా సమవేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం రాత్రి ఆయన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కెసిఆర్ తెలంగాణాపైకేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాజీనామా చేశారు. ఆ పార్టీకిచెందిన మరో లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి కూడా పదవికి రాజీనామా చేశారు. చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పదిమంది శాసనసభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేసినట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను స్పీకర్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.
కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. కరీంనగర్ జిల్లా తెలుగుదేశం శాసనసభ్యుడు ఎల్. రమణ రాజీనామా సమర్పించారు. నల్లగొండ జిల్లా నక్రకేల్ శాసనసభ్యుడు చిలువర్తి లింగయ్య కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ కూడా చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే రాజీనామా చేశారు. గజ్వెల్ ఎమ్మేల్యే నర్సారెడ్డి, నిర్మల్ ప్రజారాజ్యం శాసనభ్యుడు మహేశ్వర్ రెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్ గౌడ్ రాజీనామా చేసినవారిలో ఉన్నారు. శానసభ్యుడు బాలూ నాయక్ కూడా రాజీనామా చేశారు. వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ కూడా రాజీనామా చేశారు. పిసిసి కార్యదర్శి పదవికి, పార్టీకి ఆది శ్రీనివాస్ రాజీనామా చేసినట్లు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.ఎం. ప్రతాప్ రాజీనామా చేశారు. ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ కూడా రాజీనామా చేశారు. జిల్లా మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి రాజీనామా సమర్పించారు. నల్లగొండ జిల్లా ఆలేరు శాసనసభ్యుడు బూడిద బిక్షమయ్య గౌడ్ కూడా రాజీనామా చేశారు. తెలంగాణలోని వివిధ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా వరుసగా రాజీనామాలు చేస్త్తున్నారు. కాగా, ఉస్మానియా, కాకతీయ విశ్యవిద్యాయాల్లో విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు హన్మకొండ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన విద్యార్థుల వద్దకు కాంగ్రెస్ శాసనసభ్యురాలు కొండా సురేఖ వచ్చి తన సంఘీభావం తెలిపారు. శాసనసభ సభ్యత్వానికి అక్కడికక్కడే రాజానామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని పలు కళాశాలల విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చారు. సైఫాబాద్ పిజి కళాశాల విద్యార్థులు గన్‌పార్క్ వద్ద క్యాండిల్స్‌తో ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్‌లోని దిల్షుక్నగర్, కొత్తపేట ప్రాంతాల్లో విధ్వంసం చెలరేగింది. వాహనాలను ఆపేశారు. దాడులు చేశారు. తెలంగాణలో పలు చోట్ల కేబుల్ ప్రసారాలు నిలిపేశారు. తెలంగాణలోని న్యాయవాదులు గురువారం కోర్టులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు గురువారం ఒంటిగంటకు తెలంగాణ విద్యార్థి, యువజన సంఘాలు సమావేశమవుతున్నాయి. ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు జెఎసిని ఏర్పాటు చేయనున్నారు. ప్రజాప్రతినిధులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమవుతున్నారు.
తెరాస శ్రేణులు, తెలంగాణావాదులు తెలంగాణ జిల్లాల్లో బస్సులను ధ్వంసం చేస్తూ, బిఎస్ఎన్ఎల్ టవర్లను దగ్ధం చేస్తూ, రాస్తారోకోలు నిర్వహిస్తూ కల్లోలం సృష్టించారు. రాత్రి పొద్దుపోయేదాకా ఉద్యమకారులు ప్రభుత్వ ఆస్తులపై దాడులు కొనసాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా, తెలంగాణ జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 35 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వీరిలో టీఆర్ఎస్కు చెందిన పదిమందితో పాటు కాంగ్రెస్ 5, తెదేపా 7, పీఆర్పీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేశారు. రాజీనామాల ప్రహసనం రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు తమ రాజీనామాలను ఫ్యాక్స్‌ల ద్వారా స్పీకర్‌కు పంపించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో తెరాస శ్రేణులు స్వైరవిహారం చేస్తూ బస్సులపై, ఇతర వాహనాలపై దాడులు కొనసాగించారు.
ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై వేలాది వాహనాలను నిలిపివేసి తెరాస శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో యుపిఎ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, హోంమంత్రి చిదంబరం దిష్టిబొమ్మలను దగ్ధం చేసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, మంచిర్యాలలో తెలంగాణావాది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 22 బస్సులను ఉద్యమకారులు ధ్వంసం చేసినట్లు సమాచారం. కామారెడ్డిలో ఒక తెరాస కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతడ్ని తెరాస నాయకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి సమీపంలో గోదావరి జలాలను తరలించే పైపులైన్లను ఆందోళనకారులు పూర్తిగా ధ్వంసం చేశారు.
నల్లగొండ జిల్లాలో రాత్రి పొద్దుపోయాక ధ్వంసరచన మొదలైంది. నార్కట్‌పల్లి వద్ద ఐదు బస్సులను, ఆరు ఇతర వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. గుర్రంపోడు మండలం కొప్పోలు వద్ద బిఎస్ఎన్ఎల్ టవర్‌ను వారు దగ్ధం చేశారు. వలిగొండ, ఆలేరు, హాలియా, దేవరకొండ ప్రాంతాల్లో ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు.
24, డిసెంబర్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గెట్ వెల్ సూన్ ఆంధ్ర బ్రిటిషేర్స్