కలిసుంటేనే కలదు సుఖం.. ఓ ప్రాంతం డైలాగ్..
విడిపోతేనే.. అభివృద్ధి సాధ్యం.. మరో ప్రాంతం డైలాగ్
ఇంతకీ ఇందులో ఏది కరెక్ట్..
రాష్ట్రం విడిపోతే.. ఆంధ్రా, తెలంగాణలు నష్టపోతాయా..
లేక.. మిగతా రాష్ట్రాల కన్నా అభివృద్ధి చెందుతాయా.. విశ్లేషణాత్మక వ్యాసం...
ప్రత్యేక తెలంగాణ కోసం.. కేసీఆర్ దీక్షమొదలుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా కదిలించాయి. రాష్ట్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరగడంతో.. రాష్ట్ర విభజనకు సానుకూలంగా స్పందించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్షమూ తెలంగాణకు మద్దతు ఇస్తామని ఏకగ్రీవంగా ప్రకటించడంతో.. కేంద్రం ముందడుగు వేసింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతోందంటూ.. నేరుగా కేంద్రహోమంత్రి చిదంబరం ప్రకటించారు.... ఇంతవరకూ బాగానే ఉన్నా.. అక్కడే అసలు రగడ మొదలయ్యింది. తెలంగాణలో ఉత్సవాలు చేసుకుంటుంటే.. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కేంద్ర నిర్ణయాన్ని ధిక్కరిస్తూ రాజీనామాల బాట పట్టారు. సమైక్య రాష్ట్రమే కావాలంటూ.. ఆందోళనలు చేపట్టారు. పార్టీ అధిష్టానాలను లెక్కచేయకుండా.. దీక్షలూ మొదలుపెట్టారు. అప్పటిదాకా తెలంగాణకు జై అన్న రాజకీయపార్టీలన్నీ.. ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. దాంతో.. సమైక్య ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకొంది..
ఇది కుట్రేనా?
తెలుగువారిని విచ్ఛిన్నం చేసి.. బలహీనం చేయాలన్న దురుద్దేశంతోనే రాష్ట్ర విభజన కుట్ర జరుగిందన్నది సీమాంధ్ర నేతల వాదన. దేశంలో ఎన్నో పెద్దరాష్ట్రాలు ఉన్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చెక్కలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నఅభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. కేంద్రప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకూ.. పెద్దగా పట్టించుకోని వారంతా.. ఆ తర్వాత మాత్రం సమైక్య ఉద్యమాన్ని మొదలుపెట్టారు..
ఇక తెలంగాణకు అన్యాయం జరిగిందని.. సామాజికన్యాయం లేదని.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే శరణ్యమని చెప్పుకొచ్చినవాళ్లూ.. మాట మార్చారు. సీమాంధ్రలో సాగుతున్న సమైక్యవాదమే సరైందంటూ.. చిరంజీవి లాంటి నేతలూ పోరాటబరిలోకి దూకారు. కలిసి ఉంటేనే కలదుసుఖమంటూ వాదిస్తున్నారు. దీనికి ఆంధ్ర,రాయలసీమ ప్రజల మద్దతు కూడగట్టేందుకు శ్రమిస్తున్నారు.
వాస్తవం చెప్పాలంటే.. కేంద్ర ప్రభుత్వం విడగొట్టకుండానే.. రాష్ట్రం రెండు ప్రాంతాలుగా విడిపోయింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఉవ్వెత్తున ఉద్యమం సాగినప్పుడు.. సీమాంధ్రలో ఉలుకూ పలుకూ లేదు. అక్కడ సమైక్య ఆందోళన మొదలైతే.. ఇక్కడ ఒక్కరు కూడా వంతపాడడం లేదు. ఆంధ్రప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాజకీయ నేతలూ... సినిమా తారల్లో ఒక్కరు కూడా... సమైక్య నినాదం చేస్తూ.. ఇప్పటివరకూ తెలంగాణలో పర్యటించలేదు. కొంతమంది పర్యటిస్తామని చెప్పినా.. ఇప్పటివరకూ ఆచరణలో మాత్రం చేసి చూపలేదు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్యా.. పూర్తిగా సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.. అంతా కోరుకొని కలిసి ఉండడంతో తప్పేలేదు.. కానీ.. కలిసి ఉండాల్సిన ఇద్దరిలో ఒకరు వద్దని.. మరొకరు ముద్దని అంటే ఎలా కుదురుతుంది. అందుకే.. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇప్పుడు చిక్కుముడి పడింది. సాఫీగా సాగుతుందనుకున్న రాష్ట్ర విభజన ప్రక్రియ సమైక్య ఉద్యమం ప్రభావంతో.. జటిలంగా మారిపోయింది.
చిన్న రాష్ట్రాలతో ఉపయోగం లేదా?
చిన్నరాష్ట్రాలు ఏర్పడితే.. పేద ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.. డబ్బున్నోళ్లే పెత్తనం చెలాయిస్తారు.. ఇదీ విజయవాడ ఎంపీ లగడపాటి మాట. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సమైక్య ఉద్యమం చేస్తున్న ఆయన.. అభివృద్ధి విషయాన్నే తన ప్రచార అస్త్రంగా ఎన్నుకున్నారు. చిన్నరాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యం కాదంటూ చెబుతున్నారు. ఈ వాదననే.. పరిగణలోకి తీసుకొని పరిశోధిస్తే.. ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్రం ఇంకా విడిపోలేదు. కానీ.. ఇటీవల కాలంలో చూస్తే.. ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లు పెద్దరాష్ట్ర్రాల నుంచి విడిపోయి.. ఏర్పడినవే. అందుకే.. వీటి అభివృద్ధి సంగతే పరిగణనలోకి తీసుకుందాం.. ఈ మూడు రాష్ట్రాల్లో ముందుగా ఏర్పడింది.. ఛత్తీస్‌గఢ్. నవంబర్ 1, 2000 న మధ్యప్రదేశ్ నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. దాదాపు పదహారు జిల్లాలు ఉన్న ఈ రాష్ట్రంలో దాదాపు 40 శాతం భూమిలో అడవులే ఉన్నాయి. వ్యవసాయం ప్రధానమైన జీవనాధారం. సహజవనరులు ఉండడం ఈ రాష్ట్రానికి కలిసొచ్చింది. బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన చత్తీస్‌గఢ్... ఇప్పుడు అభివృద్ధిదిశలో పరుగులు పెడుతోంది. పదవ పంచవర్ష ప్రణాళికలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యాన్ని 6.1 గా నిర్ణయించుకున్నా... సాధించింది మాత్రం 9.2 శాతం. ఇదే సమయంలో.. ఛత్తీస్‌గఢ్ మాతృరాష్ట్రం మధ్యప్రదేశ్ మాత్రం.. 7 శాతం.. లక్ష్యాన్ని విధించుకోగా.. అందులో సాధించింది మాత్రం.. 4.8 శాతం మాత్రమే. మధ్యప్రదేశ్‌కి 29 మంది ఎంపీలుండగా.. ఛత్తీస్‌గఢ్‌కు మాత్రం కేవలం 11 మంది ఎంపీలే ఉన్నారు. దీనికి తోడు.. మావోయిస్టులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తూనే ఉన్నారు. అయినా.. పెద్దరాష్ట్రానికి దాదాపు రెండింతల వృద్ధిరేటును.. ఛత్తీస్‌గఢ్ ఎలా సాధించగలిగింది?
ఇక మరో చిన్న రాష్ట్రం.. ఉత్తరాఖండ్ విషయాన్ని చూద్దాం. నవంబర్ 9, 2000 న ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది. హిమాలయాలను ఆనుకొని.. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. 1990 నుంచి పదేళ్లపాటు.. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం ఫలితంగా.. ఈ రాష్ట్రం ఏర్పడింది. పరిశ్రమలు కూడా తక్కువే. అదే మాతృరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో పరిశ్రమలూ... వ్యవసాయమూ ఎక్కువే. పైగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. అయితే.. పదోపంచవర్ష ప్రణాళికలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యాన్ని ఉత్తరాఖండ్ 6.8 శాతాన్ని విధించుకున్నా.. 8.8 శాతం వృద్ది సాధించింది. ఇక ఉత్తరప్రదేశ్ మాత్రం వార్షిక వృద్ధిరేటును.. 7.6 శాతం లక్ష్యంగా పెట్టుకోగా.. అందుకొన్నది .. 4.6 శాతమే. పైగా.. దేశంలో మరే రాష్ట్రానికి లేనంతగా.. 80 మంది ఎంపీలు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో ఐదుగురే ఎంపీలున్నారు. మరి పెద్దరాష్ట్రానికి సాధ్యంకాని వృద్ధిని ఓ చిన్నరాష్ట్రం ఎలా సాధించగలిగింది?
మరో రాష్ట్రం జార్ఖండ్‌దీ ఇదే దారి. నవంబర్ 15, 2000న బీహార్ నుంచి విడిపోయిన తర్వాత.. అభివృద్ధిలో ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకువెళుతోంది. రాజకీయంగా అనిశ్చితి ఉన్నా.. అభివృద్ధిపై మాత్రం ఆ ఛాయలు ఏమాత్రం పడడం లేదు. బీహార్.. పదో పంచవర్ష ప్రణాళికలో వృద్ధిరేటును 6.2 శాతం లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో.. 4.7 శాతాన్ని మాత్రమే అందుకోగలిగింది. అదే జార్ఖండ్.. 6.9 శాతం లక్ష్యాన్ని పెట్టుకోగా.. అంచనాలను దాటి 11.1 శాతాన్ని సాధించింది. ఇక్కడా బీహార్‌కు 40 మంది ఎంపీలుండగా.. జార్ఖండ్‌కు మాత్రం 14 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. అయితే.. భారీ ఖనిజ నిక్షేపాలు ఉండడంతో.. వాటిని సమృద్ధిగా వినియోగించుకుంటూ.. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలుగుతోంది. ఈ మూడు రాష్ట్రాల అనుభవాన్ని చూస్తే మాత్రం.. రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణం, ఎంపీలు ఎక్కువగా ఉండడం కన్నా.. తక్కువగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రాష్ట్రాలకు వర్తించింది.. మన దగ్గర వర్తించదా.. రాష్ట్రం రెండుగా విడిపోతే.. రెండూ చిన్నరాష్ట్రాలు అవుతాయి కాబట్టి.. మరింత అభివృద్ధి చెందవా?
యాభై ఏళ్లుగా మనది పెద్దరాష్ట్రమే...
భౌగోళిక విస్తీర్ణం ప్రకారం చూస్తే.. దేశంలో నాలుగో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జనాభా పరంగా చూస్తే ఐదో అతిపెద్ద రాష్ట్రం. ఎంపీల లెక్కల్లో చూస్తే.. మనది నాలుగోస్థానం. లోక్‌సభకు 42 మంది, రాజ్యసభకు 18 మంది రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాభైఏళ్లకు పైగా.. మనది ఇదేస్థానం. అయినా.. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, చివరకు గుజరాత్‌తో పోల్చినా మన అభివృద్ధి మాత్రం దిగదుడుపే. అంతెందుకు.. 42 ఎంపీల్లో 33 మంది అధికార కాంగ్రెస్ పార్టీ వారే. అయినా.. రైల్వే ప్రాజెక్టులు రావు.. జాతీయ రహదారులు రావు.. ఒకవేళ వచ్చినా.. టోల్‌గేట్లు తప్పవు. భారత రాజధాని ఢిల్లీని కూడా కలుపుకుంటే.. దేశంలోని 29 రాష్ట్రాల్లో కేవలం తొమ్మిందింట మాత్రమే 25 కన్నా ఎక్కువ లోక్‌సభ స్థానాలున్నాయి. ఇవన్నీ అభివృద్ధికి దూరమయ్యాయా... ఒకవేళ రాష్ట్రం విడిపోతే.. 42 లోక్‌సభ స్థానాల్లో.. 25 ఆంధ్రాకు.. 17 తెలంగాణకు దక్కుతాయి. అంటే.. చాలా రాష్ట్రాల కన్నా ఉన్నతస్థానంలోనే ఆంధ్రా ప్రాంతం ఉంటుంది. రాజకీయంగా వచ్చే లోటే లేదు. ఇక వ్యవసాయ పరంగా.. విద్యా పరంగా.. ఆంధ్రప్రాంతం ఎప్పుడో అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన జరిగితే.. ఈ రెండు రంగాలకు మరింత ఊతం ఇవ్వడంతో పాటు.. పారిశ్రామికంగానూ.. మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. భౌగోళిక విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి.. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలితాలు అందుతాయి. ఇక ఆంధ్రాప్రాంతానికి మరో అడ్వాంటేజ్.. సముద్రతీరం. అంతేకాదు.. దేశంలోనే అత్యంత ఎక్కువ తీరప్రాంతం(దాదాపు 920 కి.మీ) ఉన్న రాష్ట్రం కూడా మనదే. రాష్ట్రం విడిపోతే.. ఇదంతా.. ఆంధ్రాప్రాంతానికే చెందుతుంది. దీన్ని కారిడార్‌గా చేసుకొని.. ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయొచ్చు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన వారిని వెనక్కి రప్పించుకోగలిగితే.. ఆంధ్రాకు అభివృద్ధిలో మరొకటి సాటి రాకపోవచ్చు. నేరుగా ఇతర దేశాలతో వ్యాపారం చేయొచ్చు.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆంధ్రాను సింగపూర్‌గా మార్చేయవచ్చు.
ఇలా ఏరకంగా చూసినా రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్రాకు కీడుకన్నా మేలే ఎక్కువ జరుగుతుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ సహజవనరులు ఎన్నో ఉన్నాయి. విస్తారమైన బొగ్గు నిక్షేపాలు, సున్నం గనులు, పొడవైన కృష్ణా, గోదావరి తీరాలు.. సారవంతమైన నేలలు.. తెలంగాణకు సిరులు కురిపిస్తాయి. అయితే.. పంటపొలాలకు నీటిని మళ్లించడమే సమస్య కావచ్చు. దీన్ని అధిగమిస్తే.. సాగులోనూ.. తెలంగాణ.. మాగాణిగా మారుతుంది. రాష్ట్ర విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి.. .పాలకులు అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టడానికి ఇక్కడా అవకాశం ఉంటుంది. దీనికోసం.. ఇప్పటికే.. తెలంగాణ మేథావులు ఓ మాస్టర్ ప్లాన్‌ను కూడా తయారు చేస్తున్నారు.
23, డిసెంబర్ 2009, బుధవారం
కలిసుంటే సుఖమా.. విడిపోతే సుఖమా
Categories :
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మన దేశంలో హింది ప్రముఖంగా మాట్లాడే 12 రాష్ట్రాలు లేనిది – 2 లేదా 3 తెలుగు మాట్లాడే రాష్ట్రాలుంటే తప్పా?
ఏవరికి లాభం సమైఖ్య రాష్ట్రంతో?
“ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు” — జూలూరు గౌరీశంకర్
మీ వ్యాసం చాలా బాగుంది.
ముసుగులో గుద్దులాట ఎందుకు. అంధ్రప్రదెశ్ అంటే హైదరబాదు..హైదరబాదు అంతే అంధ్రప్రదెశ్ . హైదరాబాదు కాకుండా రాష్త్రంలో ఒక్క జిల్లా ఐనా లేదా పట్టణమైన self sufficient ఐనది చూపించండి చూద్దాం! వూల్లో దోమలకి పొగవేయడానికి కూడా డబ్బులు హైదరాబాదు నుంచి మంజూరు అవ్వాలి.ఈ రాష్త్రంలో వుద్యోగాలు create చేయబదుతున్న ఏకైక పత్తనం హైదరబాదు. ఇప్పుడు ఈ రాష్త్రాన్ని రెండుగా చేసినా , మూడుగా చేసిన అందరికి హైదరబాదులో సమాన వాటా దక్కాలి. అంతేనా కాదా? ఇప్పుడు జరుగుతున్న సమైక్యవాద పోరాటం అందుకే!
good analysis
Telangana fight is for Hyderabad.
Samaikyaandhra fight is also for Hyderabad only.
Without Hyderabad, there is no question of fight for both.
However and whatever happens, the poor Hyderabad may not attract any type of investments in future.
Nobody dares to do so......
గిదేంది స్టోను మారింది ఆంధ్రోల్లు ఏమి లేమి లేని వాజమ్మలు కదా , తెలంగాణా నుంచి విడిపోతే తిండిలేక చస్తారు కదా ఎప్పుడు ఇట్లేట్ల యితది .
yes. the real dispute is about Hyderabad city. your analysis is correct. if Hyderabad is made a separate state or union territory and the Telengana and non-telengana regions can be made two separate states with new capitals, then with equal burden they will build their capitals from scratch and as smaller states develop more quickly. As in Tamilnadu, if they have non-congress governments, perhaps they can get more funds and projects from center
దేవళ్ల సతీష్....అబద్దాలను ఎంత అందంగా అతికినా వాటిమధ్య ఖాళీలు కొంచెం పరిశీలిస్తే అర్థం అవుతాయి. ఏమిటి కచరా దీక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని తీవ్రంగా కదిలించిన్దా? కే కే, డీ ఎస్ , మధు ఇత్యాది నాయకులంతా ఢిల్లీ లో కూర్చుని చిదంబరం షేషీలో ఉన్న ఒక వెధవ పిళ్ళైని మేనేజ్ చేసి తద్వారా చిదంబరాన్ని, వీ హెచ్ లాంటి వాళ్ళద్వారా ఇతరులని మోసపుచ్చి ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా ఒక ప్రకటన చేయిస్తే అది ఒక విజయం (మీ దృష్టిలో). ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్షం తెలంగాణా ఇవ్వమని చెప్పలేదు కానీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్న అభ్యంతరం లేదు అని చెప్పింది. అంటే ముఖ్యమంత్రిని కూడా అడగకుండా నిర్ణయం తీసుకోమని మీ అర్థం అయితే మీ విజ్ఞతకు జోహార్లు. సమైఖ్యరాష్ట్రం అంటూ ఎప్పటినుండో సమైఖ్య వాదులు అంటూ నే ఉన్నారు కానీ మీనాయకుల్లా రోడ్డెక్కి అబద్దాలు చెప్పలేదు ప్రజల మెదళ్ళలో విషం నింపే పని పెట్టుకోలేదు. రాష్ట్రం రెండుభాగాలుగా ఇవిదిపాయింది ని మీరు అనుకొంటున్నారు 1969 లో ఇంతకంటే ఎక్కువ స్పర్తలను తీసుకొచ్చారు మీ నాయకులు కానీ అవన్నీ కాలం మాన్పింది. తిరిగి రేగగోకారు దిగ్విజయంగా.విడిపోదాం అన్నవాళ్ళు మాటలు ఇలా ఉండకూడదు ఏమిటి సీమాంధ్రులు మిమ్మిలని దోచుకోన్నారా? ఎప్పుడు ఎక్కడ సాక్షాలు చూపమంటే చూపరు. పర్యటనలు చేయడానికి పరిస్థితులు అనుగుణంగా ఉండాలి. ఓదార్పు యాత్ర చేస్తానంటే జగన్ ని రాళ్ళతో కొట్టిన సంస్కారం మీది. తెలంగాణా ప్రజా ప్రతినిధులయి ఉంది కూడా తెరాస అనుమతిలేకపోతే తెలంగాణాలోనే తిరగలేని దుస్తితి కొంతమంది ప్రజా ప్రతినిదులది.మీ ఉద్యమానికి ఎదురు చెపితే అసంబ్లీ ఎదురుగా తోటి ప్రజా ప్రతినిధులని కూడా కొట్టించగలిగిన గొప్ప ప్రజా నాయకులు మీ సొంతం. ఇక అభివృద్ధి విషయం చూద్దాం మన రాష్ట్రం గురించి చెప్పారు మన అభివృద్ధి విషయాలు చూడండి
Year
State GDP (Rs. MM)
In Constant Dollars ($ Billion)
Growth Rates in Constant Dollars
1980
81,910
$10.2
-
1985
152,660
$15.2
50%
1990
333,360
$25.64
67%
1995
798,540
$124.2
-4%
2000
1,401,190
$33.2
37.5%
2007
2,294,610
$48.2
45.5%(7 yr
ఇవి మీ సింగిడి నాయకులు చెప్పే విషయాలు కాదు
http://en.wikipedia.org/wiki/Economy_of_Andhra_Pradesh లో ఇచ్చిన వివరాలు.ఇక చత్తీస్ గడ్ లాంటి రాష్ట్రాలు వాటి అభివృద్ధి ఎలా ఉందొ ఎక్కడినుండి ఈ వివరాలు ఇచ్చారో చెపితే చూసి సంతోసిన్చేవాళ్ళం.ఆంధ్రాను సింగపూర్ చెయ్యవచ్చో స్విట్జర్లాండ్ చెయ్యవచ్చో తరువాత చూద్దాం. మరి తెలంగాణా పరిస్తితి ఏమిటి? మీ దృష్టంతా నీటిమీదనే కదా కృష్ణా గోదావరి డెల్టాలను బీళ్ళుగా మార్చాలని కదా మీఆలోచనలు అది అందరికీ తెలుసు.దానికే మీరు మాస్టర్ ప్లాన్ అని పెరుపెట్టుకొంతున్నారు. అంతకన్నా ముఖ్యంగా మీకు హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం కావాలి.రాష్ట్ర ఆదాయంలో >45% ఒక్క హైదరాబాద్ నుండి మాత్రమె వస్తుంది అని దానిని మీరొక్కరే అనుభవించాలని మీ దురాశ దానికి కొన్ని వందల అబద్దాలు ఆడారు. కొన్నిలక్షల అసంబద్ధ వ్యాఖ్యానాలు రాసారు.