30, నవంబర్ 2009, సోమవారం
నెట్‌తో మగతనం లాస్
మీరు మగాళ్లా... నెట్ బ్రౌజింగ్ చేసే అలవాటుందా.. ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో విహరిస్తుంటారా.. నెట్‌లో ఉన్నప్పుడు ఈ లోకాన్ని మర్చిపోతారా.. అయితే.. మీకో సమస్య ఎదురుకానుంది.. అలాంటిదిలాంటిది కాదు.. మిమ్మల్ని మానసికంగా వేధించేదే..
కాలం మర్చిపోయి మరీ.. నెట్ బ్రౌజింగ్‌లో గడిపేస్తే... వారి మగతనానికే ప్రమాదమని చైనా పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. వీర్యకణాల సంఖ్య వీరిలో గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి పరిశోధనల్లో తేలింది. చైనాలో అతిపెద్ద ఆసుపత్రి అయిన.. గాంగ్సీ జుయాంగ్‌లో ఈ పరిశోధనలు జరిగాయి. 217 మంది యువకులు ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు. వీరిలో 50 శాతం మంది అతితక్కువ స్పెర్మ్‌కౌంట్ కలిగిఉన్నారు. వీరంతా కూడా ఇంటర్నెట్ ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్నవారేనని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి తోడు.. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలు కూడా.. ఇలాంటి ఫలితాలనే అందించాయి. ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్స్ (విద్యుదయస్కాంత క్షేత్రాల) మధ్య పనిచేసే వారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని ఇందులో తేలింది. పిల్లలు కావాలనుకునేవారు... వీటికి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు పరిశోధకులు. సో.. నెట్ వలలో పడిపోయి.. అసలైన దాన్ని కోల్పోకండి.. బీ కేర్ ఫుల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రపంచ జనాభా ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నష్టమా? అనాథ పిల్లలు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అనాథ పిల్లలని దత్తత తీసుకుని పెంచుకుంటే సరిపోతుంది.
ప్రవీణ్ మంచి మాట చెప్పారు.
మగతనానికి వీర్యకణాలు తగ్గడానికి సంబంధంలేదు. ప్రజల్ని తేలిగ్గా భయపెట్టవచ్చని సెల్ ఫోన్ ని కూడా అక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు అని చెబుతుంటారు. కనుక ఎవరేం చెప్పినా వినకండి.
Challa Machi matta mari Internet Cafe lo niranthram vunday Owener ? marri naku 3 pillalu nenu 12 Year nichi daily 8 Hrs. System mudhu vunatnu ... mari naku puttaru ... so be careful traced infromations choice is yours ????