3, నవంబర్ 2009, మంగళవారం
పన్ను కట్టకపోతే నో ఛాన్స్
ఆస్తిపన్ను ఎగవేసే రాజకీయ నాయకులకు జీహెచ్‌ఎంసీ ఝలక్ ఇచ్చింది. ఇంటిపన్ను బకాయి పడ్డ వారిని కార్పొరేటర్లుగా పోటీచేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని జిహెచ్‌ఎంసీ కమిషనర్ ఎస్.పి.సింగ్ ప్రకటించారు. పౌరసదుపాయాలను మెరుగుపర్చడానికి అవసరమైన ఇంటిపన్ను చెల్లింపును నిర్లక్ష్యం చేసే వారిని అభ్యర్థులుగా పరిగణించమన్నారు. దీనికితోడు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా బకాయి ఉన్న వారిని కూడా పోటీకి అనుమతించమన్నారు. ఇద్దరికి మించి సంతానం ఉన్నవారు కూడా పోటీకి అనర్హులే.
గ్రేటర్‌గా ఏర్పడిన తరువాత హైదరాబాద్‌కు తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలను జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 54లక్షల47వేల111మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాలుపంచుకోనున్నారు. దీనికోసం ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అధికారులు ఈనెల 10 నుంచి 18వతేదీ వరకు అయిదు దఫాలుగా తర్పీదు ఇవ్వనున్నారు. వార్డుల పునర్విభజనలో భాగంగా పోలింగ్‌స్టేషన్లు మారడంతో.. వాటి వివరాలను ghmc.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈనెల 12 తరువాత కాల్‌సెంటర్‌ను, 15వతేదీ నుంచి ఎస్‌ఎంఎస్ విధానాన్ని ఓటర్ల సౌకర్యార్థం అందుబాటులోకి తెస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి