24, నవంబర్ 2009, మంగళవారం
40 కోట్ల మిస్టర్ ఫర్‌ఫెక్ట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా "కిక్" సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ "మిస్టర్ పర్‌ఫెక్ట్" అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దీనికోసం దాదాపు..40 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు అంచనా. మహేశ్ బాబు చిత్రాల్లో ఇదే ఇప్పటివరకూ అత్యధిక బడ్జెట్ చిత్రం. క్రేజీ స్టార్ రామ్‌చరణ్ నటించిన మగధీర తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్ చిత్రం కూడా ఇదే కావడం విశేషం.ఈ చిత్రం గురంచి హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. "కథ వినగానే ఎంతో ఎక్సైట్ అయ్యాను. నా కెరీర్‌లో ఇది మరో సెన్సేషనల్ మూవీ అవుతుంది" అని అన్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేష్‌బాబుతో సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. "కిక్"లాంటి సూపర్‌హిట్ తీసిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ పతాకంపై మళ్లీ ఇంత భారీ చిత్రం చెయ్యడం హ్యాపీగా ఉంది" అన్నారు.
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత, ప్రముఖ నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మా పతాకంపై 40 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో నభూతో నభవిష్యత్ అనిపించే రీతిలో నిర్మాణం అవుతుంది.
మహేష్‌బాబుని కొత్త డైమెన్షన్‌లో చూపించే ఈ "మిస్టర్ పర్‌ఫెక్ట్" చిత్రం జూన్‌లో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం మిగిలిన నటీనటుల, సాంకేతిక నిపుణులు ఎంపిక జరుగుతోంది. అద్భుతమైన కథతో ఎంతో లావిష్‌గా నిర్మించే ఈ "మిస్టర్ పర్‌ఫెక్ట్"లో ఎన్నెన్నో విశేషాలుంటాయి" అని నిర్మాత వెల్లడించారు.
భారీ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా భారత్‌తో పాటు విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంటుంది. "అతిథి" తర్వాత మహేష్‌బాబు, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం సబ్జెక్ట్‌ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా రూపొందించారు.
మహేష్‌బాబు, సురేందర్ రెడ్డి, ఆర్.ఆర్, మూవీ మేకర్స్ వెంకచ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రం సినీ ఇండస్ట్రీలోనే ఓ నూతన చరిత్రను సృష్టించబోతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి