
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి సెటిలైన వాళ్లు పండగల్ని తమ సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటారు... అది కృష్ణాష్టమి అయినా విజయదశమి అయినా... ఇక రక్షా బంధన్ అయితే... వారి కల్చర్ మరింత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. రాఖీ పండగను తెలుగువారు ఒక విధంగా సెలబ్రేట్ చేసుకుంటే, సింధీస్ మరో విధంగా జరుపుకుంటారు. ఇక జైనుల ఆనవాయితీయే వేరు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ... అన్నతో పాటు వదినలకు కూడా రాఖీ కట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఈ రాఖీ ద్వారా అన్న తమను అన్ని కష్టాల నుండి రక్షించాలని కోరుకుంటారు. ఇక అన్నలైతే... ప్రతీ విషయంలోనూ అండగా ఉంటామని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసా ఇస్తారు. ఈ ఫెస్టివల్‌లో ప్రతి ఒక్కరితో కలిసి జరుపుకోవడం ఆనవాయితీ అని వీరంటున్నారు. ఎలా జరుపుకున్నా పండగ పండగే... సంప్రదాయాలు వేరైనా అన్నా చెల్లెళ్ల బంధం ఒక్కటే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి