17, జులై 2009, శుక్రవారం
రోజుల్లెక్కపెడుతున్న ఓంప్రకాశ్
మొద్దు శీను హంతకుడు.. ఓంప్రకాశ్‌కు రోజులు దగ్గరపడ్డాయా.. పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది. అసలు ఓంప్రకాశ్ చనిపోయాడంటూ వదంతులు రావడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. అసలింతకీ.. ఓంప్రకాశ్.. అనారోగ్యం బారిన ఎలా పడ్డాడు.. దీనికి కారణం ఎవరు?2008 నవంబర్ తొమ్మిదో తేదీ ... సమయం నాలుగు గంటలు ... అనంతపురం జైలులో బుద్దిగా రామకోటి రాసుకుంటున్న ఓంప్రకాష్ ... మొద్దు శ్రీనును హత్యచేశాడు. సుపారీ కిల్లర్ మోద్దుశ్రీనును ... ఓ సామాన్య నేరస్తుడు హత్యచేశాడు. అదీ ఓ డంబెల్‍తో. మొద్దు శ్రీను మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు కూడా తలమీద గాయంవల్లే మరణించాడని ధ్రువీకరించారు. అనేక అనుమానాల మధ్య కేసు అనంతపురంకోర్టుకు చేరింది. నిజానిజాలు తేల్చేందుకు నిందితుడు ఓంప్రకాశ్‌కు నార్కోటెస్టులు చేయాలని అదేశాలు జారీ చేసింది. దీంతో ఓంప్రకాశ్‌ను హైదరాబాద్- చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే అక్కడ ఓంప్రకాష్ అనారోగ్యం పాలయ్యాడు. రెండు కిడ్నీలు చెడిపోయంటూ జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న ఓంప్రకాష్‌కు .... రెండు కిడ్నీలు చెడిపోవడంపై వివాదాస్పదమయ్యింది. మొద్దుశీను తరహాలోనే అతని హత్యకూ కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతపురంలో బాగానే ఉన్న ఓంప్రకాశ్ ఆరోగ్యం.. చర్లపల్లికి రాగానే క్షీణించడానికి కారణం ఏమిటి? మితిమీరిన ఐరన్ ట్యాబ్లెట్ల వాడకం. వీటివల్లే రెండు కిడ్నీలు చెడిపోయాయంటున్నారు ఉస్మానియా డాక్టర్లు. బతికుండాలంటే.. నిరంతరం డయాలసిస్ చేయాలి. కానీ చర్లపల్లి జైళ్లో ఆ సౌకర్యంలేదు. ఓంప్రకాశ్‌కు.. ఏదో అడపాదడపా చికిత్స చేయించడం మళ్లీ.. జైలుకు తరలించడం.. ఈ క్రమంలోనే పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రతిపాదనను కూడా జైలు అధికారులు పక్కన పెట్టేశారు. అంటే.. ఎంతోకాలం ఆయన బతికే అవకాశం లేదన్నమాట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి