17, జులై 2009, శుక్రవారం
నాసా.. ఓ మతిమరుపు మేళం
Categories :
అపూర్వ సంఘటనలు.. అద్భుత క్షణాలు కొన్నే ఉంటాయి. వీడియోలో వీటిని బంధిస్తే.. ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం.. కానీ నాసా మాత్రం.. ఈ విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహిరించింది. నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం 40 ఏళ్ల క్రితం చంద్రుడిపై అడుగుపెట్టిన దృశ్యాలున్న క్యాసెట్లను పోగొట్టుకొంది. ఇప్పుడు తిప్పలు పడి..టెలివిజన్ వీడియోలను మేకోవర్ చేసుకుంటూ.. తప్పులు దిద్దుకుంటోంది..
చంద్రుడిపై మనిషి అడుగు వేసి 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. కోల్డ్‌వార్ సమయంలో రష్యాను అధిగమించి మరీ అమెరికా ఈ ఫీట్‌ను సాధించింది. ఆ దేశ వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్.. జూలై 20, 1969లో చంద్రుడిపై అడుగుపెట్టాడు. దీనికి సంబంధించి ప్రతీ క్షణాన్ని నాసా వీడియో తీసింది. టెలివిజన్లలోనూ ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి. అయితే.. సాంకేతిక లోపాల వల్ల.. టెలిజన్‌లో ప్రసారమైన వీడియోలు పూర్తి క్లారిటీతో రాలేదు. కానీ ఒరిజనల్ టేపుల్లో మాత్రం బాగానే రికార్డ్ అయ్యాయి. భూమిపైకి తిరిగివచ్చిన తర్వాత.. వీటిని నాసా అందచేసింది.. ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం. కానీ.. వీటిని జాగ్రత్తగా కాపాడడంలోనాసా నిర్లక్ష్యం వహించింది. ఇంకేముంది టేపులు మాయమయ్యాయి. 35 ఏళ్లు గడిచాకా గానీ.. నాసాకు టేపుల సంగతి గుర్తుకు రాలేదు. తీరా.. మూడేళ్లపాటు వెతికినా అవి కనిపించలేదు. దీంతో.. టీవీల్లో ప్రసారమైన వీడియోలను డిజిటల్ మేకోవర్ చేయాలని నిర్ణయించారు. హాలీవుడ్ సంస్థ.. లౌరీ డిజిటల్‌కు ఈ పనిని అప్పజెప్పారు. దాదాపు 2 లక్షల 30 వేల డాలర్లను నాసా ఖర్చు పెడుతోంది. తొలిదశలో సిద్ధమైన నాలుగుసెట్ల వీడియోలను.. తాజాగా విడుదల చేసింది. చంద్రునిపై దృశ్యాలను రికార్డు చేసిన క్యాసెట్లను.. 1970- 80ల మధ్య తిరిగి వాడేసినట్లు నాసా ప్రకటించింది. 40 ఏళ్ల క్రితమే.. చంద్రుడిపైకి వెళ్లగలిగిన నాసా.. చివరకు.. సీబీఎస్ టెలివిజన్ లైబ్రరీని ఆధారంగా చేసుకొని.. వీడియోలను పునరుద్దరించే పనిలో పడింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి