11, జులై 2009, శనివారం
మిగిలింది ఎనిమిదేళ్లే?
Categories :
ప్రపంచం త్వరలోనే నాశనమైపోతుంది.. మరో ఇరవైఏళ్లలో అని కొంతమంది అంటే.. మూడు వరస గ్రహణాలు వస్తున్న నేపథ్యంలో రెండు మూడేళ్లలోనే జరగొచ్చన్నది మరికొందరి అంచనా.. ఇక ప్రళయం గురించి.. ఒక్కొక్కరిదీ ఒక్కో మాట.. దానికి ఒక్కో ఆధారం. ఇవన్నీ జరిగినా జరగకపోయినా.. ఓ విషయంలో మాత్రం మనం ప్రమాదానికి అంచున నిలుచున్నాం. బయటపడడానికి మనకున్న సమయం కేవలం..
8 సంవత్సరాలు మాత్రమే.. అవును ఇది నిజం. గ్రహాణాలు కారణంగానో.. మరో కారణంగానో ప్రళయం వస్తుందో రాదో కానీ.. గ్లోబల్‌వార్మింగ్ కారణంగా ముంచుకొచ్చే ప్రమాదానికి సరిగ్గా వందనెలల సమయం కూడా లేదు. ఇది మనచేజేతులారా కొని తెచ్చుకుంటున్న ఉప్రదవమే. ఇవేవో కాకి లెక్కలు కాదు. బ్రిటన్ యువరాజు.. పర్యావరణాన్ని కాపడటానికి నడుం కట్టిన.. ప్లిన్స్ ఛార్లెస్ మాట. బ్రెజిల్‌లో పర్యటిస్తున్న ఆయన తాజాగా ఈ పర్యటన చేశారు. ఛార్లెస్ ప్రకటన కూడా ఆషామాషీగా చేసిందేమీ కాదు. యాభై ఏళ్ల క్రితానికి.. ఇప్పటికి వాతావరణాన్ని పోల్చి చూస్తే.. ఈ విషయం అర్థమవుతుంది. ఇక ధృవప్రాంతాలను కానీ.. హిమాలయాలను గానీ.. పరిశీలిస్తే.. ముంచుకొచ్చే ప్రమాదాన్ని అర్థం చేసుకోవచ్చు. గ్లేసియర్లు.. ఎప్పుడూలేనంత వేగంగా కరిగిపోతున్నాయి. ఎప్పుడూ మంచుతో కప్పుకుని ఉండే.. ధృవప్రాంతాల్లో చాలా ప్రాంతాలు ఇప్పుడు ఎడారులను తలపిస్తున్నాయి. వేడికి.. మంచంతా నీరులా మారి సముద్రాల్లోకి చేరిపోతుంది. ఇది మరో ప్రమాదం. సముద్ర నీటిమట్టం పెరగడం వల్ల.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవచ్చు. అసలే తక్కువగా ఉన్న భూభాగం మరీ కుచించుకుపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులే మరో ఎనిమిదేళ్లు కొనసాగితే.. గ్లేసియర్లు పూర్తిగా మాయమవుతాయి. మన హిమాలయాలు కూడా కరిగిపోతాయి. నదులు ఎండిపోతాయి.. సముద్ర నీటమట్టాలు పెరిగిపోతాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగే.. మిగిలిన ప్రాంతాల్లో కరువు తాండవం చేయొచ్చు. ఇవన్నీ జరగడానికి అవకాశాలే ఎక్కువట
కాలానికే కాలం తెలియడం లేదు. వర్షాకాలం వచ్చేసినా.. ఇంకా పూర్తిస్థాయిలో వర్షాలు పడడం లేదు. నీరందక.. వ్యవసాయం వట్టిపోతోంది. వర్షాలు కురవనందుకు కంగారు పడుతున్నామే తప్ప.. అవి ఎందుకు పడడం లేదన్న విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే.. ఈ ప్రతికూల పరిస్థితులకు కారణం. భూవాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. దీనిపై పర్యావరణ వేత్తలు దశాబ్దాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. పెద్దగా పట్టించుకున్న ప్రభుత్వాలు లేవనే చెప్పాలి.
మానవజీవితం యంత్రమయమవుతున్నకొద్దీ.. వాతావరణ కాలుష్యం తీవ్రమవుతోంది. ఇంథనాల వినియోగం విపరీతంగా పెరగడంతో పాటు.. ఫ్యాక్టరీ గొట్టాలు వెలువరుస్తున్న ప్రమాదకర వాయువులు.. గాలిని కూడా విషంగా మార్చేస్తున్నాయి. మొత్తంమీద వాతావరణంలో.. గ్రీన్‌హౌస్ వాయువుల శాతం ప్రమాదకరస్థాయికి చేరుకుందనే చెప్పాలి. వీటివల్లే భూవాతావరణంలో వేడి పెరిగిపోతోంది. వర్షాలు పడకపోవడానికి కూడా ఇదే కారణం.. మరోవైపు.. ప్రపంచ నీటి అవసరాలను తీర్చుతున్న గ్లేసియర్లు.. క్రమంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామికీకరణను పెంచిపోషిస్తున్న ప్రపంచ దేశాలు.. పర్యావరణాన్ని కాపాడడంలో మాత్రం ముందుకురావడం లేదు. ఇటీవలికాలంలో.. పర్యావరణంపై కాస్త అవగాహన పెరిగినప్పటికీ.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఇది ఏమాత్రం చాలదనే చెప్పాలి.
మరి ఇప్పుడేం చేయాలన్న సందేహం అందరిది. ముందు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. వీలైనంతవరకూ మొక్కలు నాటాలి. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంతమంచింది. ప్రభుత్వాలు సైతం.. అడవులు తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇలాంటి dooms day ప్రవచనాలు చాలా వచ్చాయి. అవి నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవి నిజంగా జరగకపోతే తమకేమీ తెలియనట్టు నటిస్తారు అలా చెప్పిన వాళ్ళు.