ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైఖేల్ జాక్సన్ వచ్చే జన్మలో స్త్రీగా పుట్టబోతున్నాడట. ఈ విషయం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని ఇది నిజం అంటున్నారు వాల్టర్ సెంక్యూ.
వాల్టర్ పునర్జన్మలమీద రీసెర్చ్‌లు చేస్తుంటాడు. ఇతను పునర్జన్మల కాన్సెప్ట్‌తోనే పునర్జన్మపై పుస్తకం రాశాడు. ఇందులో ప్రముఖుల గురించి వివరించాడు. ముఖ్యంగా మన దేశ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ కలామ్ గత జన్మలో టిప్పుసుల్తాన్ అని, అలాగే షారూఖ్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ గురించికూడా ఆయన తన పునర్జన్మ పుస్తకంలో పేర్కొన్నాడు.

మైఖేల్ జాక్సన్ గురించి వాల్టర్ మాట్లాడుతూ... జాక్సన్ గత జన్మలో చార్లెస్ డెస్కోని అనే ఫ్రెంచ్ దేశానికి చెందిన రాజు అని, అతనికి ప్రపంచమంతా తనగురించి చెప్పుకోవాలనే కోరిక బలీయంగా ఉండేదని, ఆ జన్మలో తన కోరిక తీరకపోవడంతో ఈ జన్మలో మైఖేల్ జాక్సన్‌గా ప్రజల ముందుకు వచ్చి సెలిబ్రిటీగా మారాడని ఆయన అన్నారు.
ఫ్రెంచ్ రాజు చార్లెస్ డెస్కోనీ 16వ శతాబ్దంలో జీవించాడని, ఇరవై ఒకటవ శతాబ్దంలో మైఖేల్ జాక్సన్‌గా అవతరించాడని, త్వరలో స్త్రీగా పుట్టి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంటాడని వాల్టన్ అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మరో పుస్తకం రాయనున్నట్లు ఆయన ప్రకటించారు.
జోకా? సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తరువాత కూడా పునర్జన్మలు, పుక్కిటి పురాణాల మీద విశ్వాసాలా? కలియుగాంతం పేరుతో పుస్తకాలు వ్రాసిన బాగా సంపాదించిన ఒక పండితుని గురించి వినే ఉంటారు. మైఖేల్ జాక్సన్ పునర్జన్మ గురించి పుస్తకం వ్రాస్తానంటున్నది కూడా ఆ టైప్ మనిషే.