ఢిల్లీ పోలీసుల అత్యాచార సంగాతనను మరువక ముందే మన ఖాఖీ లు అందుకు తామేమి తీసిపోమని నిరూపించుకున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్ ఖాకీలు కీచకావతారమెత్తారు. కంచె చేను మేసిన చందంగా స్త్రీల మాన, ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన ఖాకీలు, భక్షకులుగా మారారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక యువతిని నగ్నంగా ఫొటోలు తీసి పలు రకాలుగా వేధిస్తున్న పోలీసుల అకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గంపలగూడెం మండలానికి చెందిన ఒక యువతి వెల్వడం గ్రామానికి చెందిన తన స్నేహితుడితో సుమారు నెలన్నర క్రితం స్థానికంగా ఒక లాడ్జిలో బస చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి చెందిన ఐడి కానిస్టేబుల్, స్థానిక పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఆ యువతీ యువకులు నగ్నంగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి ఆ కానిస్టేబుళ్లు బ్లాక్‌మెయిల్ చేసి ఆ యువతిపై అత్యాచారం జరిపారు. అంతటితో ఆగకుండా ఆమె ప్రియుడి వద్ద ఉన్న బంగారం, డబ్బు దోచుకున్నారు. ఆతర్వాత కూడా ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం మరోమారు ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి తమ వద్దకు పిలిపించుకొని మైలవరం సమీపంలో ఒక మామిడి తోటలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశారు. వీరితోపాటు వీరి స్నేహితులైన స్థానికంగా విత్తనాల షాపు యజమాని, బేకరీ యజమాని, చండ్రగూడెం, వెల్వడం గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. పోలీసులు చేస్తున్న ఆకృత్యాన్ని భరించలేని ఆమె ఎవరికీ చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక చివరికి ప్రియుడితో మొరపెట్టుకుంది. అసలే తమది అక్రమ సంబంధం, ఏమి చేయాలో తెలియని ఆమె ప్రియుడు స్థానికంగా ఉన్న న్యాయవాదిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబుచ్చుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని సదరు న్యాయవాది సంబంధిత కానిస్టేబుల్‌ను పిలిపించి విచారించగా వీరు కంగారుపడి రాజీయత్నాలు చేయాలని ప్రాధేయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక పెద్ద మనిషి వద్ద రాజీ ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. జరిగిన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. బాధిత మహిళ, సదరు న్యాయవాది సహకారంతో నేరుగా మెజిస్ట్రేట్‌ను కలిసి స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా అందరూ ఒకే గూటి పక్షులనీ, వీరి వలన తనకు న్యాయం జరగదని ఆమె భావించి నేరుగా న్యాయమూర్తిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఇటువంటి ఖాకీ మానవ మృగాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటాం
యువతి పట్ల కీచకంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూజివీడు డిఎస్‌పి బి.మనోహర్‌సింగ్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఖాకీల ఆకృత్యం తనకు ఉదయమే తెలిసిందనీ, వెంటనే వారికి పనిష్‌మెంట్ ఇచ్చి నూజివీడు సబ్‌జైలు గార్డ్ డ్యూటీకి పంపినట్లు తెలిపారు. వీరు చేసిన పని పోలీసుశాఖకే తలవొంపు తెచ్చిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి పేర్కొన్నారు.
26, జూన్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
http://david-vennela.blogspot.com/2009/06/blog-post.html
ఈ లింకు కూడా చదవండి.
Untomohox
aweg