25, జూన్ 2009, గురువారం
యుజిసి, ఎఐసిటిఇ రద్దు ?
దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రొఫెసర్ యశ్‌పాల్ కమిటీ చేసి న సిఫారసులను 100 రోజులలో అమలు చేయగలమని మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబా ల్ బుధవారం తెలిపారు. ఈ సంస్కరణల అమలులో జా ప్యం కుదరదని ఆయన అన్నారు. ఈ కమిటీ సిఫార సులు అమలులోకి వచ్చిన పక్షంలో యుజిసి, ఎఐసిటిఇ వంటి సంస్థలను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా యూనివర్సి టీలకు పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి లభించడంతో బాటు అవి ఒక జాతీయ కమిషన్ పర్యవేక్షణ కిందకు వస్తాయి. ప్రొఫెసర్ యశ్‌పాల్ తమ కమిటీ తుది నివేదికను బుధ వారం మానవ వనరుల శాఖకు అందజేశారు. కమిటీ తన నివేదికలో పలు సూచనలు చేసింది. వాటిటో ఎఐసి టిఇ, యుజిసి వంటి రెగ్యులేటరీ సంస్థల రద్దు, యూనివ ర్సిటీల కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం, వాటి పర్యవెక్షణకు ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. 'మేము ఉన్నత విద్య, పరిశోధనకు సంబంధించి ఒక జాతీయ కమిషన్ ఉండాలని, యుజిసి, ఎఐసిటిఇ వంటి రెగ్యులేటరీ సంస్థలను రద్దు చేయాలని కోరాం' అని ఆ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఈ జాతీయ కమిషన్, ఎలక్షన్ కమిషన్ మాదిరి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయి ఉం టుంది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్ర్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ సంస్థ చైర్మన్‌ను, సభ్యులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ కమిషన్ ఏర్పాటుకు రాజ్యాంగాన్ని సవరించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. రద్దు చేసిన యుజిసి, ఎఐసిటిఇ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ) వంటి సంస్థల సిబ్బందికి మరో ఇతర సంస్థలో స్థానం కల్పించాలని ఆయన అన్నారు. యూనివర్సిటీలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం ద్వారా అవి తమకు తామే రెగ్యులేటరీ సంస్థ మాదిరి పని చేస్తాయని, అంతేకాక వాటికి పూర్తి స్థాయి విద్యాపరమైన బాధ్యతలు కూడా ఉంటాయని ఆ సభ్యుడు తెలిపారు. అవే వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల తో సహా తమ కార్యక్రమాల రూపకల్పన, పనితీరును, వ్యవస్థను రూపొందించకుంటాయని ఆయన తెలిపారు. కాగా జాతీయ కమిషన్ యూనివర్సిటీల పనితీరును పర్యవేక్షిస్తూ అవి సరైన విధంగా విద్యా, పరిశోధనా అభివృద్ధి రంగాలలో ముందుకు సాగేలా చూస్తాయని ఆయన తెలిపారు. కాగా డీవ్డ్ు యూనివర్సిటీలు నాణ్యతగల విద్యను అందించేందుకు వాటికి సంబంధించి కఠినమైన నిబంధనలు విధించాలని కమిటీ సూచించింది. 'రినోవేషన్ అండ్ రిజువినేషన్ ఆఫ్ యూనివర్సిటీస్' పేరుతో కమిటీ ఈ ఏడాది మార్చిలోనే మధ్యంతర నివేదికను అందజేసింది. ఈ కమిటీని 2008 ఫిబ్రవరిలో ఉన్నత విద్యా సంస్థల పనితీరు అధ్యయనానికి, వాటికి సంబంధించి చర్యలు సూచించేందుకు ఏర్పాటు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
యూ.జీ.సీ, ఎ.ఐ.సి.టి.ఈ , ఈ రెండూ ఆశించినంత స్థాయిలో పని చేయడం లేదనే నిజం ప్రతీ విశ్వవిద్యలయ విద్యార్థికీ తెలుసు. వాటిని క్రమబద్ధీకరించకుండా, వాటిలోని అక్రమాలని అరికట్టకుందా, వాటిని ఏకంగా రద్దుచేసి, ఒక monopolist-centralised system ని పెట్టి అన్ని సమస్యలు తీరుతాయనడం ప్రష్నార్థకం. మనకి కావల్సింది సమర్థమైన సంస్థలు మరియూ వాటిని ఉన్నతమైన భావాలతో నడిపే యువత. అలా కాకుండా ఒక ఏదుగురు తలమాసిన "పెద్దలని" పెట్టి కమిటీలమీద కమిటీలు వెస్తే ఏమి కాదు. ఏక్కద వేసిన గొంగళి అక్కడె!