3, జూన్ 2009, బుధవారం
కత్రీనా నచ్చిందా.. అయితే వైరస్ వచ్చినట్లే..
Categories :
ఇంటర్నెట్ . కత్రీనా కైఫ్ . ఫోటోలు . వైరస్
ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ బ్యూటీగా మార్కులు కొట్టేసిన బాలీవుడ్ సుందరి కత్రీనా కైఫ్. సల్మాన్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్న ఈ సుందరి చుట్టూ ఇప్పుడు వైరెస్‌లు తిరుగుతున్నాయి. అపార్థం చేసుకోకండి.. నేను చెప్పేది ఇంటర్నెట్ వైరెస్ గురించి. వైరస్‌ల దాడులపై ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సంస్థ మెక్అఫీ చేసిన ఓ సర్వే సంచనల నిజాలను బయటపెట్టింది. వైరస్‌లను వ్యాప్తి చేయడానికి హ్యాకర్లు.. ఇప్పుడు కత్రీనా కైఫ్ సెక్సీ ఫోటోలను అందుకు పావులుగా వాడుకొంటున్నారు. అందాలొలికిస్తున్న ఆమె ఫోటోలను నెట్‌లో పెట్టి వాటికి మాల్‌వేర్ ప్రోగ్రాంలను అనుసంధానం చేస్తున్నారు. ఒక్కసారి నెట్‌నుంచి కత్రీనా ఫోటోను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. వైరస్ కంప్యూటర్‌లోని చొచ్చుకుపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో కంప్యూటర్ల వాడకం దార్లందరికీ తెలిసిందే. ఫోటోల ద్వారా వైరస్‌లను పంపించడం ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ ఇది మాత్రం కాస్త అడ్వాన్స్‌డ్ అనే చెప్పాలి. ఎక్కువ సెర్చ్ చేస్తున్న టాపిక్‌లను ఈ వైరస్ వ్యాప్తికి వాడుకొంటున్నారు. నెట్ సెర్చ్ లో అందరికన్నా ముందున్న కత్రీనా ఈ వైరస్‌కు తొలి పావుగా మారింది. కాబట్టి అంతర్జాల మిత్రులారా.. నెట్ నుంచి కత్రీనా ఫోటోనే కాదు.. మిగిలినవీ డౌన్‌లోడ్ చేసేముందు జాగ్రత్త...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి