4, జూన్ 2009, గురువారం
తధాస్తు దేవతలుంటారు. జాగ్రత్త
Categories :
తదాస్తు దేవతలుంటారు జాగ్రత్త.. పొరపాటున ఏదైనా అంటుంటే పెద్దవాళ్లు చెప్పేమాట ఇది. పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జే.సీ. దివాకర్‌రెడ్డి దీన్నే ఇప్పుడు తలుచుకుని తలచుకుని కుమిలిపోతున్నారు. ఈసారి మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న జేసీ.. మంత్రివర్గ ఏర్పాటుకు ముందు ఏమరిపాటున ప్రొటెం స్పీకర్‌గా పనిచేస్తానని అన్నారు. దీనిపై రోశయ్యకూడా ఆశ్చర్యపోయారు. ప్రొటెం స్పీకర్‌గా పనిచేసేవారికి మంత్రి మండలిలో చోటుండదు. అంటే.. జేసీకి మంత్రి పదవి అక్కర్లేదా అని ఆయన విలేకర్లవద్ద ప్రస్తావించారు. దీన్ని తెలుసుకున్న జేసీ.. అబ్బే అలా అనలేదంటూ.. సర్దుబాటు చేసేశారు. కానీ తదాస్థు దేవతలు మాత్రం జేసీ నోటిమాటలను ఊరికే తీసుకున్నట్లు లేరు. చివరకి వచ్చేసరికి.. మంత్రి పదవికి జేసీ దివాకర్‌రెడ్డికి దక్కలేదు. పైగా.. ప్రొటెం స్పీకర్‌గా పనిచేయమని వైఎస్ ఆర్డర్ వేసేశారు. ఏదో ఏమరుపాటుగా అన్నా.. అదే నిజమయ్యే సరికి.. జేసీ ఏం చేయాలో అర్థం కాలేదంట. కాబట్టి ఏదైనా అనేసేముందు మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోంది. ఎందుకంటే.. పైన తదాస్తు దేవతలుంటారు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి