
చిలకలూరిపేట, ఆదివారం, 19 ఏప్రిల్ 2009
యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను చిలకలూరిపేటలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించిన కారణంగా పోలీసులు పవన్‌ను అరెస్టు చేయడం గమనార్హం. ఈ విషయానికి సంబంధించి వివరాల ప్రకారం ఆదివారం ఒంగోలులో పర్యటన అనంతరం పవన్ గుంటూరు జిల్లాకు వచ్చారు. హెలికాప్టర్ మరమ్మత్తుకు గురికావడంతో ఆయన బాపట్ల సభ సాయంత్రానికి వాయిదా పడింది. దీంతో మార్గమధ్యంలో పవన్ చిలకలూరిపేటలో ప్రసంగించారు. అయితే చిలకలూరిపేటలో ప్రసంగించడానికి పీఆర్పీ ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్‌ను అరెస్టు చేశారు. అయితే వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చిన పవన్ తన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి