20, ఏప్రిల్ 2009, సోమవారం
బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్ పాత్ర ఉంది: పాశ్వాన్
బాబ్రీ మసీదు కూల్చివేతకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.ఇప్పటికే కూటమిలో భాగమైన మరో పార్టీ ఆర్జేడీ కూడా బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్ పాత్ర ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ అధినేత, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బాబ్బీ మసీదు కూల్చివేత వివాదంలో కాంగ్రెస్ను ఇరుకునపెట్టగా, తాజాగా ఆయన బాటలో రాంవిలాస్ పాశ్వాన్ కూడా నడిచారు.లాలూ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని పాశ్వాన్ ప్రశ్నించారు. అంతేకాకుండా హాజీపూర్ నియోజకవర్గంలో 2000 ఓట్లు కూడా రావని తెలిసినా, కాంగ్రెస్ చేస్తుందేమిటని ప్రశ్నించారు. తనపై పోటీకి అభ్యర్థిని ఎందుకు నిలిపారు..? వారు ఇక్కడ ఏ బలాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారని పాశ్వాన్ ఘాటుగా స్పందించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రాంవిలాస్ పాశ్వాన్, Laloo, Mulayam, Amar Singh, Karunanidhi, Samuel Reddy, Pawar, Sonia are the most dangerous politicians in India. They can sell India to gain few Muslim votes.