
సామజిక న్యాయమంటూ దూసుకొచ్చిన చిరంజీవి తన మాట పూర్తిగా నేరవేర్చుకోలేక పోయారు. రెండో దశ ఎన్నికల ప్రచారం ముగుస్తున్నప్పటికి ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు ఇచ్చిన సీట్లలో ప్రచారానికీ అయన దూరంగా ఉన్నారు. ఏడు జనరల్ సీట్లలో ఎస్సి, ఎస్టీలకు టికెట్లను ఇచ్చారు. కానీ చిరంజీవిగాని, పవన్ కళ్యాణ్ గాని ఒక్కసారి కూడా ప్రచారానికీ వెళ్ళలేదు. పిఆర్పీ తొలి టికెట్ ప్రకటించిన తుపాకుల మణెమ్మ పోటి చేస్తున్న నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలోను అధినేతలు ప్రచారం చేయలేదు. బహుశా చిరంజీవి దృష్టిలో ఇదే సామాజిక న్యాయమేమో... దీనిపై మీరేమంటారు.. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని అందరితో పంచుకొండి.
Very good point.
Open seats ల లో, S.C./S.T. లకు కొన్నిచోట్ల ఇచ్చినమాట నిజమే. కాని అది వాళ్ల మీద ప్రేమ కంటే, మేము ఇచ్చామని చూపించుకోవటానికో, లేకపోతే లోపాయకారిగా కుదిరిన ఒప్పందాల్లవల్లనో.
Example జగ్గయ్యఫేట అది Open seat అయినా వేరే వాళ్లకు ఇచ్చారు వేరే ఊరినుండి తెచ్చి మరీ. అది ఉదయభాను (కాంగ్రెస్స్) తో కుదుర్చుకొన్న ఒప్పందం వలనే అని, అక్కడ ప్రతి ఒక్కళ్లు చెప్పుకొంటున్నారు.
అలా ఇచ్చిన నియోజకవర్గాలకు అన్న గాని, తమ్ములం గార్లు గాని ప్రచారానికి మాత్రం వెళ్లకపోవటం మాత్రం నిజం, చుట్టుప్రక్కల వాటికి వెళ్లినా. సొంత పార్టీ టికెట్స్ ఎటూ అమ్ముకొన్నారు, అది చాలదన్నట్లు అవతల పార్టీ వాళ్ల డబ్బులు కోసం ఈ కక్కుర్తి ఒకటి. చిరు కోసం, చొక్కాలు చించుకొన్న ఆ నియోజకవర్గ జనాలు/అభిమానులు మాత్రం ఎవరికి వోటు వెయ్యాలో అర్ధం కాక జుట్టులు పీక్కొంటున్నారు.
నిజంగా రాజకీయాలలో "మార్పు" మాత్రం తెచ్చింది "ధనరాజ్యం" పార్టీయే, ఈరకంగా, కాదనేది ఎవరు!!
vela elluga kulavyavasthato angaarina samaajamlo samajika nyayam anedi oka bruhat prakriya.
idi saadhinchataaniki samayam padutundi. sahanam lekunda edi saadhinchalem. ye sthayi vyakti gurinchi aina sannihitulake atanigurinchi baaga telustindi.
migilina prajalandariki vaaru aparichitule. anduvalla vyaktitvani anta twaraga anchana veyakudadu.