19, ఏప్రిల్ 2009, ఆదివారం
జోగయ్య 'సీటు'లిటిగేషన్!
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పాలకొల్లు, తిరుపతి రెండు చోట్లా విజయం సాధిస్తే పాలకొల్లునే అట్టేపెట్టుకుంటారని పార్టీ సీనియర్ నాయకుడు చేగొడి హరిరామ జోగయ్య ప్రకటించి కొత్త సమస్యను సృష్టించారు. చిరంజీవి రెండు చోట్ల గెలుపొందడం అంత సులభం కాదని అనుకుంటున్న సమయంలో జోగయ్య ప్రకటన కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. 'తిరుపతిలో గెలిచినా ఆయన పాలకొల్లునే ఉంచుకుంటారు కాబట్టి ఇక్కడ గెలిపించడం అనవసరం' అంటూ తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు. అలాగే పాలకొల్లులో కూడా 'ఇక్కడ గెలిచినా ఆయన పార్టీని స్థాపించిన తిరుపతి స్థానాన్నే ఉంచుకుంటారు కాబట్టి ఇక్కడ గెలిపించడం అనవసరం' అని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం అనుకున్న ఫలితాన్ని సాధిస్తే, రెండు నియోజకవర్గాల్లోనూ చిరంజీవికి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని ప్రజారాజ్యం నాయకులు ఆందోళన చెందుతున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి