
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సక్సెస్ కావడం అంత ఈజీ కాదని యువ సామ్రాట్ నాగార్జున అన్నారు. ఐనా.. ఆయన ఆశలు నెరవేరాలని మిత్రుడిగా కోరుకుంటానన్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ కూటములు స్వార్ధం కోసం ఏర్పడ్డవే కాని, ప్రజల అవసరాల మేరకు కాదని నాగ్ అభిప్రాయపడ్డారు. తాను ఏ పార్టీకి తొత్తును కాదని స్పష్టం చేశారు. తనకిష్టమైన రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైఎస్సార్ అని నాగార్జున చెప్పారు. తాత స్థాపించిన పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నారని అందులో తప్పేమీలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రజాపయోగ పనులు చేసారని నాగ్ ప్రశంసించారు. ఓటర్లంతా తమకు ఎవరు మేలు చేస్తారో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి