
పాక్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. షరియత్ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో స్వాత్ లోయలో జిజియా పన్ను విధించారు. దీని ప్రకారం అక్కడ ఉంటున్న ముస్లిమేతరులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫిరోజ్ఖేల్ ప్రాంతంలో ఉంటున్న సిఖ్ వర్గానికి చెందిన 15 కుటుంబాలు 5 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని తాలిబన్లు ఆదేశాలు జారి చేశారు. లేకపోతే వారి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. పాకిస్తాన్ పూర్తిగా ముస్లిం దేశంగా మార్చడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 10 సిఖ్ కుటుంబాలు ఫిరోజ్ఖేల్ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి