16, ఏప్రిల్ 2009, గురువారం
ధోనీ, బజ్జీలకు పద్మశ్రీ కన్నా పైసలే మిన్న
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఒక సామెత... అయితే ఇది మన క్రికెటర్లకు పట్టినట్లు లేదు. విషయమేమిటంటే... దేశంలో అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డు అందుకునేందుకు కూడా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్‌లకు తీరిక దొరకడం లేదు. వీరిద్దరూ వాణిజ్య ప్రకటనల షూటింగ్స్‌తో బిజీగా ఉండి ఈ అవార్డుల కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఢిల్లీలో ఉండి కూడా అవార్డుల అందుకోవడానికి వెల్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు షూటింగ్ పూర్తి కాగానే ధోనీ ఐపీఎల్ సెకండ్ సీజన్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళిపోయాడు. బాధ్యత గల స్థానంలో ఉండి వీరిద్దరూ ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని పలువురు విమర్శిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి