15, ఏప్రిల్ 2009, బుధవారం
పత్రికలన్నింటిది ఒకేదారి
తెలుగు పత్రికలన్నీ ఇప్పుడు ఓ మహా యజ్ఞాన్ని చేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఒక్క సాక్షి తప్ప ఎ పత్రిక కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయడం లేదు. వార్త మాత్రం కాస్త అటు ఇటుగా కథనాలు ఇస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, సూర్య పేపర్లు తెలుగుదేశం విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కనీసం చిరంజీవి ప్రజారాజ్యానికి కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరి ఓటరు వీటి ప్రభావానికి గురి అవుతాడో లేక సొంతగా ఆలోచిస్తాడో చూడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి