భోపాల్, గురువారం, 16 ఏప్రిల్ 2009
రాజకీయ నేతలపై బూట్లు విసిరే సంస్కృతి భారత్‌లో క్రమంగా ఊపందుకుంటోంది. విదేశాల్లో ప్రారంభమై భారత్‌కు చేరుకున్న ఈ సంస్కృతికి మొదటగా కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం గురికాగా తాజాగా భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సైతం ఈ జాబితాలో చేరారు. భోపాల్‌లోని కట్నీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో అద్వానీపై ఈ బూటు దాడి జరిగింది. బీజేపీకి చెందిన పవాస్ అగర్వాల్ అనే కార్యకర్త అద్వానీపై ఈ దాడికి పాల్పడడం గమనార్హం. ఈ దాడినుంచి అద్వానీ తప్పించుకోగా అక్కడే ఉన్న పోలీసులు సదరు కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో హోంమంత్రి పి. చిదంబరంపై ఓ సిక్కు జర్నలిస్టు బూటు విసిరి సంగతి తెలిసిందే. సిక్కులపై జరిగిన ఊచకోత ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టైట్లర్‌కు సీబీఐ క్లీన్‌చీట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సదరు సిక్కు జర్నలిస్టు హోంమంత్రిపై బూటు విసిరాడు. ఈ ఘటనను మర్చిపోకముందే కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్‌పై ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఉపాధ్యాయుడు బూటు విసిరి నిరసన వ్యక్తం చేశాడు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ ఇరాక్ పర్యటన సందర్భంగా ఓ జర్నలిస్టు ఆయనపై బూటు విసిరి తన నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే
16, ఏప్రిల్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి