
అసదుద్దీన్... ఖాసిం రిజ్వీ ఒక్కటేనని వైజాగ్ డిఐజి ఎ.బి. వెంకటేశ్వర్లు సంచలన ప్రకటన చేసారు. రజాకర్ల నేతగా నిజాం పాలనలో ఖాసిం రిజ్వీ చేసిన అరాచకాలకు.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసి చేస్తున్న దానికి ఎ మాత్రం తేడా లేదన్నారు. చదువులో అసదుద్దీన్ఒవైసిను జిన్నాతో పోల్చిన వైజాగ్ డిఐజి .. వ్యవహారంలో మాత్రం ఖాసిం రిజ్వీతో పోల్చడం విశేషం. ఇప్పటికే డి.జి.పి. మహంతి తో గొడవ పడుతున్న అసదుద్దీన్ఒవైసిను వెంకటేశ్వర్లు ఇలా అనడం ప్రకంపనలు పుట్టిస్తోంది. దమ్ముంటే పోటికి రమ్మంటూ డి.జి.పి. మహంతికి సవాల్ విసిరిన విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ఒవైసిను ఎదుర్కోవడానికి హోం గార్డ్ చాలన్నారు. ఈ వ్యాఖ్యలపై లీగల్ గా వెళ్ళడానికి ఒవైసీ సిద్దమవుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి