14, ఏప్రిల్ 2009, మంగళవారం
తీవ్రవాదుల చెరలో పాకిస్తాన్
పాకిస్తాన్ క్రమంగా తీవ్రవాదుల గుప్పిట చిక్కుతోంది. కీలకమైన స్వాత్ లోయపై తాలిబన్లు పూర్తిగా పట్టు సాధించారు. వారు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న షరియత్ ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయడానికి పాక్ అధ్యక్షుడు జర్దారి ఆమోద ముద్ర వేశారు. స్వాత్ లోయలో ఇకపై పాక్ చట్టాలు ఏమాత్రం పనిచేయవు. ఇప్పటికే అక్కడి మహిళలపై తాలిబన్లు ఎన్నో అక్షలు విధిస్తున్నారు. మగవాళ్ళు తోడు లేకుండా ఇల్లు దాటి బయటకు రాకుడదని హెచ్చరించారు. 7 జిల్లాలను ఆక్రమించిన తాలిబన్లు మరిన్ని ప్రతాలను స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు సఫలమైతే పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ అయిపోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి