
ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై కర్నూలు ఫస్‌టక్లాస్ మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. రెండవ విడత ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 20 కర్నూలు నగరంలో రాత్రి పది గంటల తర్వాత… కూడా రోడ్ షో నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందున ఆయనపై కర్నూలు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే చిరంజీవి ఈ వారెంట్‌పై ఇప్పటివరకు కోర్టుకు హాజరు కానందున ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి