16, జనవరి 2012, సోమవారం
కొరియర్లో తల్లిపాలు
Categories :
breast milk . courier . indonesia . life . mother milk . news . sex . TOP
నవమాసాలు మోసి కన్న బిడ్డ ఇంట్లో ఉంటుంది. ఆ బిడ్డకు ఆకలేసిన సమయంలో పాలు ఇవ్వలేని స్థితిలో తల్లి ఉంటుంది. ఎందుకంటే ఆమె వర్కింగ్ వుమెన్ కాబట్టి. వరల్డ్‌వైడ్‌గా ఆఫీస్, ఫ్యాక్టరీ, కంపెనీల్లో పనిచేస్తున్న తల్లులు ఎదుర్కొనే సమస్యే ఇది. మరి దీనికి పరిష్కారం లేదా..?
కొరియర్‌లో తల్లిపాలు...కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ... ఫిలిప్పీన్స్‌లో వర్కింగ్ వుమెన్ ఇప్పుడీ పద్దతినే అవలంభిస్తున్నారు. శిశువు ఆకలి అలమటిస్తున్న వేళ...తల్లి పాలే అందిస్తే. అంతకన్నా కావాల్సింది ఇంకేముంది. ఓ ఇండోనేషియన్ ఆలోచన ఎంతోమంది నవజాతశిశువుల ఆకలిని తీర్చడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఎంతోమంది తల్లులకు, తమ పిల్లలకు తమ పాలే ఇవ్వగలుగుతున్నామన్న తృప్తినీ కలిగిస్తోంది. ఇటీవలే రాజధాని జకార్తాలో సర్వీస్‌ను ప్రారంభించిన బ్రెస్ట్ మిల్క్ కొరియర్... తల్లికి, బిడ్డకు మధ్య వారధిగా పనిచేస్తోంది.
బ్రెస్ట్ మిల్క్ కొరియర్ ప్రారంభానికి వెనుక ఓ సదుద్దేశం ఉంది. పోషక విలువలున్న తల్లి పాలు లభించకపోతే శిశువుల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 2007లో ఇండోనేషియాలో 38 శాతం పిల్లలు.. తల్లిపాలకు దూరమయ్యారు. దీనిపై తీవ్రంగా ఆలోచించిన...40 ఏళ్ల ఫిక్రీ నౌవల్ అనే ఈ వ్యక్తి...బ్రెస్ట్ మిల్క్ కొరియర్‌ను ప్రారంభించాడు. భవిష్యత్తు తరం ఆరోగ్యంగా ఉండాలన్నది ఇతని లక్ష్యం. అందుకోసం వివిధ రూట్లను సెర్చ్ చేస్తూ... తల్లి ఇచ్చే పాలను తీసుకెళ్లి బిడ్డకు అందేలా చేస్తున్నాడు..
కాంపిటీషన్ వరల్డ్‌లో వర్కింగ్ వుమెన్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఫిలిప్పీన్స్‌లో అయితే.. నవమాసాలు మోసి కన్న బిడ్డలను కనీసం.. మూడు నెలలన్నా అల్లారుముద్దుగా చూసుకోలేని పరిస్థితి. సమయానికి తల్లిపాలందించడానికి కొరియర్స్ సిద్ధంగా ఉండడంతో.. తల్లులకు ఇప్పుడు టెన్షన్ తీరిపోయింది. 45 నిమిషాల నుంచి గంట మధ్యలో డెలివరీ చేసే బ్రెస్ట్ మిల్క్ కోసం...కొరియర్స్ సంస్థ..మన కరెన్సీలో...దాదాపు..175 రూపాయల నుంచి...225 రూపాయలు ఛార్జ్ చేస్తోంది. అమ్మో ఇంత ధరా అనుకోకండి. కన్నబిడ్డ ఆరోగ్యంతో పోల్చితే.. ఈ మొత్తం చాలా తక్కువేకదా..
Click Here For English Version
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి