
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. మరో సారి తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నాడు. ఓం శాంతి ఓం కోసం 42 ఏళ్ల వయస్సులో సిక్స్ ప్యాక్‌తో కనిపించి దేశం మొత్తాన్ని అవాక్కు పరిచిన కింగ్ ఖాన్.. ఈ సారి హ్యాపీ న్యూ ఇయర్ సినిమా కోసం ఏకంగా టెన్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు. 48 ఏళ్ల వయస్సులో టెన్ ప్యాక్ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ వ్యాప్తంగా సిక్స్ ప్యాక్ కు ఆ మధ్య క్రేజ్ వచ్చిందంటే దానికి షారుక్ ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు టెన్ ప్యాక్ ను కూడా సాధించడం చూస్తే.. దానికీ డిమాండ్ పెరిగిపోతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి