కాంగ్రెస్ యువరాజు రాహుల్ కీలకమైన విషయాల్లో క్లారిటీ మిస్ అవుతున్నాడా.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. తెలంగాణలో పర్యటించిన రాహుల్.. జనాన్ని ఆకట్టుకోవడం కోసం జోరుగా ప్రసంగించారు. అందులో ఆయన ప్రస్తావించిన కొన్ని విషయాలు, ఇచ్చిన హామీలు సాధ్యమవుతాయా లేదా అన్నది పరిశీలించాల్సి ఉంది.
ప్రస్తుతం యువకులు ధరిస్తున్న గడియారాలు, టీషర్టులు, షూలు అన్నీ మేడిన్ చైనా అన్న పేరుతో వస్తున్నాయన్నారు రాహుల్ గాంధీ. డబ్బు మనది, ఉపాధి చైనా వాళ్లదంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాటన్నింటిపైనా మేడిన్ తెలంగాణ అని వస్తుందని, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. హామీ వరకూ బాగానే ఉన్నా.. ఓ వస్తువు మీద మేడిన్ తెలంగాణ అని వేయడం కరెక్టా కాదా అన్నది రాహుల్ ఆలోచించలేకపోయారు. మన దేశంలో తయారైన ఏ ఉత్పత్తి అయినా మేడిన్ ఇండియా అనే ఉంటుంది తప్ప.. మేడిన్ ఆంధ్రప్రదేశ్, మేడిన్ మధ్యప్రదేశ్, మేడిన్ గుజరాత్ అంటూ ఉండదు. జనాన్ని ఆకర్షించడానికి మరీ ఇంతలా హామీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు.. రాహుల్ కాస్త ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకుంటే మంచిదేమో..!

కామెంట్‌ను పోస్ట్ చేయండి