నటసామ్రాట్ అక్కినేనికి క్యాన్సర్ సోకిందన్న విషయం అందరికీ తెలిసిందే. అభిమానులెవరూ అపోహ పడకూడదని, వదంతులు నమ్మకూడదని ఆయనే స్వయంగా అక్టోబర్ 19న మీడియా సమావేశాన్ని పెట్టి మరీ క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని ఎంతో ధైర్యంగా ప్రకటించారు.అయితే, అది ఏ క్యాన్సర్ అన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. దీంతో, అక్కినేనికి సోకిన క్యాన్సర్ ఏమిటన్న ఉత్కంఠ చాలామందిలో వ్యక్తమయ్యింది.
24 గంటలకు అందిన సమాచారం ప్రకారం అక్కినేనికి చిన్నప్రేగు క్యాన్సర్ సోకింది. కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక శస్త్ర చికిత్స చేసిన వైద్యులు, క్యాన్సర్ కణాలున్న చిన్నపేగు భాగాన్ని విజయవంతంగా తొలిగించారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లేనని చెబుతున్నారు వైద్యులు. పైగా, క్యాన్సర్ కణాలు మొదలైన తొలిరోజుల్లోనే డాక్టర్లు గుర్తుపట్టడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కోలుకుంటున్న నాగేశ్వరరావు, మరికొన్ని రోజుల్లోనే పూర్తి ఆరోగ్యంతో అందరికీ కనిపిస్తారని అంటున్నారు కుటుంబ సభ్యులు.
27, అక్టోబర్ 2013, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి