11, ఫిబ్రవరి 2012, శనివారం
ఆగిపోయిన అధినాయకుడు
Categories :
adhinayakudu . balakrishna . entertainment . tollywood . TOP
బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నఅధినాయకుడు సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి సినీ నిర్మాత వైఖరే కారణమని తెలుస్తోంది. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ఆయన ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వడం లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న అధినాయకుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కావచ్చింది. హీరో బాలకృష్ణ మరో మూడు రోజులు డబ్బింగ్ చెబితే సినిమా విడుదల కావడం ఖాయం. అయితే.. సినిమా విడుదలైతే, ఒక్కపైసా కూడా అందదని గుర్తించిన టెక్నీషియన్లు బాలయ్యను ఆశ్రయించారు. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. అప్పుడు కానీ, బాలయ్యకు అసలు విషయం అర్థం కాలేదు.. తనకు కూడా నిర్మాత డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని.. అంతే, నిర్మాత ఎం.ఎల్. కుమార చౌదరికి కబురు పెట్టాడు. రాగానే, డబ్బుల సంగతి అడిగాడు.. రెండు మూడు రోజుల్లో సర్దేస్తామని రోటీన్ డైలాగ్ వదిలాడు సదరు నిర్మాత. అంతే, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతే మిగిలిన డబ్బింగ్ అంటూ బాలయ్య వెళ్లిపోయినట్లు ఫిల్మ్ వర్గాలు గుసగులాడుతున్నాయి. ఈ దెబ్బకు అధినాయుకుడు ప్రాజెక్టు కాస్తా అటకెక్కినట్లు తెలుస్తోంది. నిర్మాత డబ్బులు విదిలిస్తే కానీ, రిలీజ్ కాని పరిస్థితి నెలకొంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి