27, ఫిబ్రవరి 2012, సోమవారం
ఉపఎన్నికల్లో ధన ప్రవాహం
Categories :
byelection . cash seize . POLITICS . TOP
రాష్ట్రంలో జరగుతున్న ఉపఎన్నికల్లో నోట్ల కట్టలు ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన నాగర్ కర్నూలుకే ఎక్కువగా నోట్ల కట్టలు తరలుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో నగదు సరఫరా పై దృష్టి పెట్టిన పోలీసులు భారీగా తనిఖీలు చేస్తున్నారు. శనివారం నిర్వహించిన సోదాల్లో ఓ చోట నాలుగు లక్షలు, మరో చోట ఆరు లక్షల నగదు పట్టుబడింది. కార్లలో అక్రమంగా తీసుకెళుతుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు. ఇక సోమవారం దేవరకద్ర చెక్ పోస్ట్ దగ్గర తనిఖీల్లో మరో 30 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత కారులో వీటిని పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న నాగం జనార్దనరెడ్డిని ఓడించడానికి, జేసీ బ్రదర్స్ అధినేత జనార్ధనరెడ్డిని బరిలోకి దింపిన తెలుగుదేశం పార్టీ.. ఇక్కడ సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి