10, జనవరి 2012, మంగళవారం
బాలయ్యకు అంత సీన్ లేదన్న చిరు
Categories :
balakrishna . chiranjeevi . POLITICS . TOP
కొంతమంది సామాజిక న్యాయమంటూ వచ్చారు.. పోయారు.. మా నాన్న సామాజిక న్యాయాన్ని ఓటుబ్యాంకుగా చూడలేదంటూ కృష్ణా జిల్లా పర్యటనల్లో వీరలెవల్లో బాలయ్య మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అందరికీ అర్థం కూడా అయ్యింది. చిరంజీవికీ అర్థమయ్యింది. దీని మీద మీ రెస్పాన్స్ ఏమిటంటూ.. విశాఖలో చిరంజీవిని అడిగిన రిపోర్టర్లకు, ఊహించని సమాధానంఇచ్చారు మెగాస్టార్. "బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన వ్యాఖ్యలకు నేను సమాధానం చెప్పాల్సిన పనిలేదు" అని కారెక్కి అరకుకు వెళ్లిపోయారు చిరు. బాలయ్యకు అంత సీన్ లేదన్న విషయాన్ని ఇలా సెలవిచ్చారు మెగాస్టార్. అన్నట్లు.. ఆ మాధ్య రాంచరణ్‌ను ఉద్దేశించి బాలయ్య మాట్లాడినప్పుడు.. ఇదే చిరంజీవి, ఆయనేం మాట్లాడినా కరెక్టే నంటూ తిరుపతిలో సెలవిచ్చారు. మరి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటో...!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి