10, జనవరి 2012, మంగళవారం
బాబుకూ..జగన్కూ ఎంత తేడా..?
పోరాట స్వరూపాలు వేరైనప్పటికీ, ఇద్దరి యాత్ర పరమార్ధం ఒక్కటే. రైతు సమస్యలు తెలుసుకోవడం కోసం పాలకుర్తికి చంద్రబాబు వెళితే, రైతులకు న్యాయం చేయాలంటూ ఆర్మూర్ కు వెళ్లారు జగన్. ఇక చంద్రబాబు టూర్ ను అడ్డుకోవాలని పిలుపు నిచ్చిన తెలంగాణ జేఏసీ, జగన్ విషయంలోనూ అదే పిలుపును పునరుద్ఘాటించింది. జగన్ ను అడ్డుకోవాలని, అడ్డుకుంటామని చెప్పింది. కానీ, వాస్తవంలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది... పాలకుర్తిలో చంద్రబాబు యాత్రకు వారం రోజుల ముందు నుంచే టీఆర్ఎస్ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలతో నానా రభస సృష్టించింది. చంద్రబాబు దండుపై దాడి చేసింది. బాబు యాత్రను భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించింది. మరి జగన్ విషయంలో అలాంటి దృశ్యాలు మచ్చుకైనా లేవు. హైదరాబాద్లో జగన్ బయలు దేరి నిజామాబాద్ టౌన్కు చేరుకునే దాకా చిన్న చిన్న అవాంతరాలు తప్ప, జగన్ టూర్ కు బ్రేక్ వేయగలిగేంత స్థాయిలో టీఆర్ఎస్ గానీ తెలంగాణ వాదులు కానీ ఆందోళనలు చేపట్టలేదు. కాన్వాయ్ ను నిలపలేదు. పైపెచ్చు.. ఎక్కడికక్కడ జగన్ కు అపూర్వ నీరాజనం. నిజామాబాద్ టౌన్లో మాత్రం మహిళలు జగన్ కాన్వాయ్ పైకి కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. వీర లెవల్లో ప్రకటనలిచ్చే నేతలందరూ ఇళ్లకే పరిమితమైపోతే, దిశానిర్దేశం లేని క్యాడర్ మనకెందుకులే అనుకుంది. ఇక ఆవేశం ఉన్న కుర్రవాళ్లు మాత్రం అక్కడక్కడా జగన్ ను అడ్డుకుందామని ప్రయత్నించారు. కానీ, వారి శక్తి సరిపోలేదు. చంద్రబాబు విషయం అంత హడావిడి చేసిన టీఆర్ఎస్... పార్లమెంట్ల సమైక్య ప్లకార్డును పట్టుకుని మరీ నుంచున్న జగన్కు ఎందుకు మినహాయింపు ఇచ్చినట్లు.. ఇది తెలంగాణ భవన్ ఏలికలే తెలియాలి..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి