29, జనవరి 2012, ఆదివారం
టీడీపి వదిలినా..మేం పార్టీని వదలం..: హరికృష్ణ
Categories :
balakrishna . chandrababu . harikrishna . POLITICS . tdp . TOP
టీడీపీలో ఫ్యామిలీ ఫైట్..
హరికృష్ణను వెలివేస్తారా..?
సీతయ్య టీడీపీని వీడుతారా..?
బాలయ్య రాకతో ఆత్మరక్షణలో ..?
టీడీపీలో మళ్లీ చక్రం తిప్పాలని భావిస్తున్న సీతయ్య.. స్పీడ్ పెంచారు. కొన్నాళ్లుగా పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న ఆయన.. బాలకృష్ణ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో, మళ్లీ యాక్టివ్ అయ్యారు.. పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు. అయితే.. రాజకీయాల్లోకి వస్తానంటూ బాలయ్య ప్రకటించడంతోనే హరికృష్ణలో ఇంతమార్పు వచ్చిందన్న వార్తలు టీడీపీ వర్గాల్లో ప్రచారమవుతున్నాయి. దీనికి తోడు.. హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ చెప్పడానికే.. చంద్రబాబు బాలయ్యను బరిలోకి దింపారన్న వాదనా ఉంది..
హరికృష్ణ కూడా తాజా పరిణామాలతో కలత చెందినట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తమను వదిలిపెట్టుకోవాల్సిందే తప్ప.. తాను,జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తనలోనూ..తన కొడుకులోనూ ప్రవహించేది ఎన్టీఆర్ రక్తమేనన్నారు. ఎన్టీఆర్ పేరు భూమిమీద వినిపించినంతకాలం, టీడీపీ బతికే ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హరికృష్ణ వ్యాఖ్యల్లో మర్మం ఏమిటి..? తనపై కుట్ర జరుగుతోందని హరికృష్ణ భావిస్తున్నారా..? ఇవే అనుమానాలు ఇప్పడు టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. హరికృష్ణ వ్యాఖ్యలతో టీడీపీలో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్న విషయం అర్థమవుతోంది. అయితే.. ఇది ఎంతవరకూ దారితీస్తుందన్నదే ఇప్పుడు సస్పెన్స్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి